అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్–ప్లాప్‌లను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన  తండేల్ సినిమాలతో మంచి విజయం సాధించిన చైతూ, ఇప్పుడు వృషకర్మ సినిమాలో నటిస్తున్నారు. నటనలోనే కాదు, ఫిట్నెస్‌ విషయంలో కూడా అక్కినేని కుటుంబం ఎంత క్రమశిక్షణ పాటిస్తుందో అందరికీ తెలిసిందే.65 ఏళ్ల వయసులోనూ నాగార్జున యువ హీరోలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. అదే విధంగా చైతన్య కూడా 39 సంవత్సరాల వయసులోనూ అద్భుతమైన ఫిట్ లుక్‌ను మెయింటెయిన్ చేస్తూ అభిమానులకు ఫిట్నెస్ గోల్స్ ఇస్తుంటారు. ఇక చైతూ తన డైట్, వ్యాయామం విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


నాగచైతన్య ఫిట్నెస్ రహస్యాలలో మొదటిది చక్కెరకు దూరంగా ఉండటం. చక్కెర శరీరానికి అత్యంత హానికరమైన టాక్సిన్ అని, అనవసరంగా ఎక్కువ తీసుకుంటే అనేక వ్యాధులకు దారితీస్తుందనీ చైతూ గతంలో ఒక పాడ్‌కాస్ట్‌లో వివరించారు. అందుకే తాను చక్కెర, షుగర్ ఉన్న పానీయాలు, పదార్థాలను పూర్తిగా దూరం పెడతానని చెప్పారు.ప్రతిరోజూ ఉదయం లేవగానే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ఎక్కువగా నీళ్లు తాగడం చైతూ తప్పనిసరి నియమాలలో ఒకటి. సరైన హైడ్రేషన్‌తోనే రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుందని ఆయన నమ్మకం. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్‌ను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటారు.



ఫిజికల్ ఫిట్నెస్ కోసం చైతూ కార్డియో మరియు స్ట్రెంత్ ట్రైనింగ్ రెండింటినీ సమానంగా ఫాలో అవుతారట. జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలతో స్టామినాను మెయింటెయిన్ చేస్తూ, బాడీ స్ట్రెంత్ కోసం పుల్ అప్స్, పుష్ అప్స్, చిన్ అప్స్ వంటి బేసిక్ కానీ అత్యంత ప్రభావవంతమైన వర్కౌట్స్‌ను రెగ్యులర్‌గా చేస్తుంటారు.చైతూ అసలైన ఫుడ్ లవర్. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం తనకు ఎంతగానో ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా విదేశీ వంటకాలను ఆస్వాదించడం ఇష్టపడతారు. అయితే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా, దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయడం మాత్రం ఎప్పుడూ మిస్ అవరు. ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత — ఈ మూడు సమతుల్యం వల్లే చైతూ తన ఫిట్‌నెస్‌ను అద్భుతంగా మెయింటెయిన్ చేస్తారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: