సినిమా ఇండస్ట్రీ లో ఒక మాస్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే ఆ హీరో అభిమానులు తమ అభిమాన నటుడి ని వెండి తెరపై చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు ... ఆ హీరో ఎంట్రీ సీన్ ఒక ఎత్తు. తమ అభిమాన నటుడి ఎంట్రీ సీన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఎంట్రీ సీన్ వస్తుందా ..? దానిని దర్శకుడు ఎంత గొప్పగా డీల్ చేశాడు ..? దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంత గొప్ప మ్యూజిక్ ను ఇచ్చాడు ..? ఇలా అనేక కోణాలలో తమ అభిమాన హీరో ఎంట్రీ గురించి చాలా మంది మాట్లాడుకోవాలి అని వారు భావిస్తూ ఉంటారు. దానితో ఒక మాస్ హీరో తో సినిమా తీస్తున్నాము అంటే చాలు దర్శకులు కూడా సినిమా అంతా ఒకే కానీ హీరో ఎంట్రీ సీన్ పై చాలా కసరత్తు చేస్తూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ సినిమాను రూపొందిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తారక్ కి ఏ రేంజ్ లో మాస్ ఈమేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన సినిమాల్లో ఎంట్రీ సీన్స్ కోసం ఆయన అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు.ఇక ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంత్ , ఎన్టీఆర్ సినిమాలో ఎంట్రీ సీన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎంట్రీ సీన్ కోసం ఆయన ప్రత్యేకంగా కొన్ని సెట్స్ లను కూడా వేపిస్తున్నట్లు , ఈ ఎంట్రీస్ సీన్లో ఏకంగా 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తారక్ ఎంట్రీ సీన్ కోసం ప్రశాంత్ ఇంత పెద్ద స్కెచ్ వేయడంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: