పెళ్లిళ్లు, విడాకులు.. కేసుల పరంపర!.. రాఖీ సావంత్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమెకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి పెళ్లి: రాఖీ మొదట వ్యాపారవేత్త రితేష్ సింగ్‌ను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఈ పెళ్లి కూడా పెద్ద దుమారం రేపింది. రెండో పెళ్లి (వివాదం): ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి ఆదిల్ ఖాన్ దురానీని సీక్రెట్‌గా పెళ్లాడింది. ఈ కాపురం ఎక్కువకాలం నిలవలేదు. వీరిద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోయారు. విడిపోవడమే కాదు, రాఖీ సావంత్ రెండో భర్త ఆదిల్ ఖాన్ దురానీపై సంచలన ఆరోపణలు చేసింది. తనను తరచుగా కొట్టాడని, మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్ కూడా చేశారు.
మూడో పెళ్లి.. అదీ పాకిస్తాన్‌తో! .. ఇద్దరితో విడిపోయి, రెండో భర్తను జైలుకు పంపిన తర్వాత, ఇప్పుడు రాఖీ సావంత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె ఏకంగా మూడో పెళ్లికి సిద్ధమైంది. ఈసారి పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత అయిన డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి పాకిస్థాన్ లో, రిసెప్షన్ ఇండియాలో, హనీమూన్ మాత్రం స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్‌లో ఉండబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ వివాదాల సుందరి ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండేందుకే ఇష్టపడుతుందని ఈ ప్రకటన మరోసారి నిరూపించింది. ఈ మూడో పెళ్లి అయినా ఆమె జీవితంలో నిలకడను తీసుకొస్తుందో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి