టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్.. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. అయితే, ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ముఖ్యంగా 'స్పైడర్', 'మన్మధుడు 2' వంటి సినిమాల ఫలితాలు ఆమె కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం చూపాయని చెప్పక తప్పదు.
కెరీర్ పరంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా ఒక ముఖ్యమైన అంశంపై స్పందిస్తూ వార్తల్లో నిలిచారు. కొందరు సైబర్ మోసగాళ్లు రకుల్ పేరుతో కాల్స్, మెసేజెస్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు.
మోసగాళ్లు వాడుతున్న ఆ నంబర్ తన ఫోన్ నంబర్ కాదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఆ నంబర్ తో ఎవరైనా సంప్రదించినా, ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా రియాక్ట్ కావద్దని, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఆమె సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేర్లతో మోసాలు, సైబర్ నేరాలు ఊహించని స్థాయిలో జరుగుతున్నందున, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని రకుల్ కోరారు.
ముఖ్యంగా, సినీ పరిశ్రమలోని ప్రముఖుల పేర్లను వాడుకుని డబ్బులు వసూలు చేయడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వంటి నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా ఆమె పరోక్షంగా సూచనలు చేశారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి