ఇప్పుడు అందరికంటే ముందుగా పాన్ ఇండియా సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా బజ్ ఏంటంటే… ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుసగా కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ముఖ్యంగా మహేష్ బాబు పాత్రకు సంబంధించిన చిన్ననాటి ఎపిసోడ్‌లను ఈ మధ్యే చిత్రీకరిస్తున్నారని సమాచారం. రాజమౌళి ప్రతి పాత్రకు, ప్రతి బ్యాక్‌స్టోరీకి ప్రత్యేకమైన ఇంపోర్టెన్స్ ఇస్తారు కాబట్టి, ఈ చైల్డ్‌హుడ్ సీక్వెన్స్ కూడా సినిమాలో హైలైట్ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక యాక్షన్, ఎమోషన్, మైథలాజికల్ షేడ్స్, విజన్… అన్నింటినీ కలిపి ఒక గ్లోబల్ అడ్వెంచర్ స్టైల్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టుగా ఇండస్ట్రీ టాక్. మహేష్ బాబును ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ మరియు ఇంటెన్స్ అవతారంలో చూపించడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఇమేజ్ మరింత గ్లోబల్ స్థాయికి వెళ్లడం ఖాయమనే ఫీలింగ్ ఫ్యాన్స్‌లో ఉంది.
సంగీత విభాగంలో ఎంఎం కీరవాణి ఇప్పటికే బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరొక భారీ విజువల్ అడ్వెంచర్‌కి ఆయన కంపోజ్ చేస్తున్నందుకే సంగీతంపై కూడా భారీ అంచనాలున్నాయి. ప్రతి ఫస్ట్ నోట్ నుంచే ఆ రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ యొక్క మాంత్రికత వినిపించనుంది.ఇక విడుదల విషయానికి వస్తే, ‘వారణాసి’ని 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి కాని వరకు జక్కన్న ఒక్క వివరాన్నీ బయటకు రానివ్వరు. కానీ ఇప్పటివరకు బయటికి వచ్చిన చిన్న చిన్న అప్డేట్స్ చూస్తే… దీనమ్మ ఇక జక్కన్నను ఎవ్వరూ ఆపలేరని చెప్పడానికి ఇదొక్కటే సాక్ష్యం!
మొత్తానికి, ‘వారణాసి’ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ మొత్తం కళ్లల్లో మెరుస్తున్న ప్రాజెక్ట్. మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసే సినిమా అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో, ట్రేడ్ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి