ఫ్యామిలీ ఫోటోలు, చిలిపి క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు— బాగా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు కూడా అర్హ ఎంత త్వరగా పెద్దదవుతోందో అంటూ ఆశ్చర్యపోతున్నారు. స్టైలిష్ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌కు ఎప్పుడూ సోషల్ మీడియాలో భారీ రిస్పాన్స్ ఉంటుంది, ఈసారి కూడా అదే జరిగింది.అల్లు అర్హ చిన్న వయసులోనే ప్రేక్షకులను తన నటనతో అలరించింది. 2023లో ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తూ సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అల్లు అర్హ చిన్న ప్రిన్స్ భరతగా కనిపించింది. ఆమె తెరపై కనిపించిన ప్రతీసీన్ ప్రేక్షకులు, క్రిటిక్స్ దృష్టిని ఆకర్షించింది. చిన్నపిల్ల అయినప్పటికీ చూపిన అమాయకత్వం, నటనలోని నేచురల్ అప్రోచ్— ఇవన్నీ సినిమా హైలైట్‌లుగా మారాయి.
చిన్న వయసులోనే స్టైలిష్ లుక్స్, చలాకీతనం, క్యూట్ అండ్ కాన్ఫిడెంట్ ప్రెజెన్స్‌తో అర్హకు సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ఆమె చేసే డాన్స్ వీడియోలు, ఫన్ మోమెంట్స్, ఫ్యామిలీతో గడిపే టైమ్— ఏది వచ్చినా వెంటనే వైరల్ అవుతూ ఉంటుంది.తన కూతురు పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ప్రత్యేక సమయం కేటాయించారు. అల్లు అర్జున్ & స్నేహా రెడ్డి కపుల్ ఫ్యామిలీ గోల్స్‌గా నిలుస్తూ, పిల్లలతో గడిపే ప్రేమపూర్వక క్షణాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.అర్హ బర్త్‌డే ఫోటోల్లో కనిపించిన ఆనందం, ఫ్యామిలీ బాండింగ్ మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను దోచుకుందని చెప్పాలి. అర్హ మరింత ప్రతిభ కనబరుస్తుందని, భవిష్యత్తులో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్‌లో కనిపిస్తుందో అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఇప్పటికే మొదలైంది. అయితే ఈ మద్య కాలంలో ప్రతి స్టార్ తమ లైఫ్ కి సంబంధించిన ప్రత్యేక మూమెంట్ ని దుబాయ్ లోనే ఎక్కువుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి రీజన్స్ రకరకాలుగా చెప్పుకుంటున్నారు జనాలు. అక్కడ క్లైమేట్..షాపింగ్..ఎంటర్టైన్నింగ్ ఫెసిలిటీస్ బాగుంటాయి అని అందుకే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్తున్నారు. బన్నీ కూడా అందుకే తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి సెలబ్రేషన్ అక్కడే చేసుకుంటుంటాడాని అంటున్నారు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి