అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు "దేవర 2"లో అసలు కథ ఏంటి? దేవర నిజమైన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది?" అనే ఆతృతలో రోజులు లెక్కపెడుతున్నారు. కొరటాల కూడా కొన్ని సందర్భాల్లో "దేవర 2 స్క్రిప్ట్ రెడీ అవుతోంది… త్వరలో సెట్స్‌పైకి వెళ్తాం" అని చెప్పడంతో ఫ్యాన్స్ మరింత పాజిటివ్‌గా ఉన్నారు.కానీ తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మాత్రం అభిమానుల్లో నిరాశను నింపుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ శ్రద్ధతో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తయ్యే వరకు మరో చిత్రానికి ఒప్పుకునే అవకాశం లేదని టాక్. అంతేకాదు డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా మరికొన్ని పెద్ద కొలాబరేషన్లు ఆలోచిస్తున్నాడని, ఈ క్రమంలో దేవర 2పై నటుడు అంతగా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది.
కొంతమంది ఫిల్మ్ స్టార్స్ అభిప్రాయం ప్రకారం—దేవర 1కీ ఎదురైన మిక్స్ టాక్, వర్కౌట్ కాలేని కొన్ని క్రియేటివ్ ఛాయిసెస్ కారణంగా ఎన్టీఆర్ దేవర 2 చేయడాన్ని ప్రస్తుతం ప్రాధాన్యంగా చూడడం లేదు" అని అంటున్నారు. ఇలా జరుగుతుంటే, అభిమానులు ఆశపడుతున్న దేవర 2 పూర్తిగా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మాత్రం అధికారికంగా ఎవరు స్పష్టీకరించలేదు. కొరటాల శివ కూడా దీనిపై ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ టీమ్ కూడా స్పందించకపోవడంతో ఈ ప్రచారాలు మరింత బలపడుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు—దేవర కథ పూర్తి కాకపోతే ప్రాజెక్ట్ అర్థాంతరంగా నిలిచిపోయినట్టే. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా దేవర 2 రావాలి’’ అని. మొత్తానికి… ‘దేవర 2’పై అనుమానాలు పెరుగుతున్న ఈ సమయంలో, అధికారిక ప్రకటన మాత్రమే అన్ని ఊహాగానాలకు ముగింపు పలకనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి