టాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే ఇద్దరు భారీ స్టార్‌లు — రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఈ ఇద్దరు ఒకే తెరపై కలిసి కనిపించబోతున్నారనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కాంబినేషన్‌ గురించి మొదటిసారిగా వినిపించినప్పటి నుండి అభిమానుల్లోనే కాకుండా, ఇండస్ట్రీ వర్గాలలో కూడా భారీ ఆసక్తి నెలకొంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యంత హాట్ డైరెక్టర్‌గా ఎదిగిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.


కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందనే రూమర్ బయటకు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల వల్ల చాలానే బిజీగా ఉంటున్న నేపథ్యంలో, ఆయన డేట్స్ ఇవ్వడం ఎంతవరకు సాధ్యం? నిజంగానే అటువంటి ప్రాజెక్ట్ సాధ్యమా? అనే సందేహాలు అభిమానుల్లో పుట్టాయి. అందుకే చాలామంది అది కేవలం గాసిప్ మాత్రమే అయి ఉండొచ్చు అని భావించారు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజమే. కానీ ఇది ఊహించినట్లుగా ఒక సింగిల్ హీరో సినిమా కాదు. ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ కలిసి నటించే భారీ మల్టీస్టార్రర్ మూవీగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఇది మాత్రమే కాకుండా, ఈ కథకు కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉందట.



రెండు నెలల క్రితం లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ మరియు కమల్ హాసన్‌తో ఒక మల్టీస్టార్రర్ సినిమా చేయాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ కథను ఇద్దరికీ వివరించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను లోకేష్ కనగరాజ్ పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్‌కి వినిపించాడట. ఇద్దరు స్టార్‌లు కూడా ఆ కథను ఎంతో ఆసక్తిగా విని వెంటనే ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఈ ఇద్దరు పాన్–ఇండియా లెవల్ స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని వినిపించగానే అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహం నెలకొంటుందో చెప్పనక్కర్లేదు. అంతేగాక లోకేష్‌ స్టైల్‌కు గాను అద్భుతమైన యాక్షన్, పెద్ద కాన్వాస్, సీరియస్ డ్రామా, స్టైలిష్ ప్రెజెంటేషన్ అన్నీ ఉంటాయని భావిస్తున్నారు. అందుకే ఈ మూవీ ఇప్పటికే అధికారిక ప్రకటనకంటే ముందే పాన్–ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ అనౌన్స్‌మెంట్ రావొచ్చన్న వార్త ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అలా జరిగితే కొత్త సంవత్సరం స్టార్ట్‌నే టాలీవుడ్‌కు ఘనమైన బిగ్ బ్యాంగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: