- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

డిసెంబర్‌లో టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న చిత్రాల్లో బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ అగ్రస్థానంలో ఉంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొని బాలయ్య కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ముఖ్యంగా బాలయ్య మళ్లీ ఆఘోరా , శివుడి దివ్య తపస్సు, రుద్రరూపం, డైలాగ్ పవర్‌తో ఎలా అలరించబోతారన్న ఆసక్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. విలన్ పాత్రకు కూడా సమానమైన బరువు, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వబడిందని టాక్. సినిమాలో భారీ యాక్షన్ బ్లాక్‌లు, పవర్‌ఫుల్ సంభాషణలు, ఆధ్యాత్మిక టచ్ ఈ సారి ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయని తెలిసింది. సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైంది.


ఇదిలా ఉంటే అఖండ 2 స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షోలు డిసెంబర్ 4న  దేశవ్యాప్తంగా పలుచోట్ల ఏర్పాటు చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ పెంపు కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రీమియర్ షో టికెట్ ధరను రు. 600గా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయం సినిమాపై ఉన్న హైప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్‌లో ‘ బజరంగీ భాయిజాన్ ’ సినిమా తో దేశవ్యాప్తంగా పేరుపడ్డ హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంతో టాలీవుడ్‌కు అడుగు పెట్టబోతుంది. ఆమె పాత్ర కథలో కీలక మలుపు తిప్పేలా ఉంటుందని ప్రచారం.


రామ్ అచంట - గోపీ అచంట కలిసి నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ బాలయ్య అభిమానుల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ మొదటి వారంలోనే బాక్సాఫీస్ దుమ్ము రేపే సినిమా ఇదే అని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: