రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ గ్రాండియర్ ‘పెద్ది’ . ప్రస్తుతం భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. స్టైలిష్ మేకింగ్, ఇంటెన్స్ ఎమోషన్స్, నేటివ్ ఫ్లేవర్‌తో కూడిన కథ అని ఇప్పటికే ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించడం మరొక పెద్ద హైలైట్‌గా మారింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్‌లో రామ్ చరణ్ లుక్ సింప్లీ మైండ్‌బ్లోయింగ్‌గా ఉందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. అలాగే మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో ఊహించని రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తూ తెలుగు మాత్రమే కాదు పాన్-ఇండియా ఆడియెన్స్‌లో కూడా పెద్ద హంగామా చేసింది. పెద్ది సినిమా మీద క్రేజ్ ఒక్కరోజు ఒక్కరోజుకి రెట్టింపు అవుతోంది.


అలాంటి సమయంలో ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ కి కూడా సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. “విక్కీ కౌశల్ పెద్ది టీమ్‌లో ఎలా వచ్చాడు?”, “బుచ్చిబాబు ఏం కొత్త ప్లాన్ చేస్తున్నాడు?”, “విక్కీ ఏ రోల్ చేస్తున్నాడు?” అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు.కానీ అసలు నిజం మాత్రం వేరే. పెద్ది సినిమాలో నటుడు విక్కీ కౌశల్ నటించడంలేదు. ఆయన తండ్రి, బాలీవుడ్‌కు చెందిన టాప్ క్లాస్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టంట్ మాస్టర్‌గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘దంగల్’, ‘భజరంగీ భాయిజాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్‌బస్టర్లకు ఆయనే హై-వోల్టేజ్ యాక్షన్ డిజైన్ చేశారు. అలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టంట్స్ కోసం బుచ్చిబాబు ప్రత్యేకంగా ఆయన్ని ఈ ప్రాజెక్ట్‌కు తీసుకున్నట్టు ఇండస్ట్రీ టాక్.



ప్రస్తుతం పెద్ది టీమ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. ఈ ఫైట్‌లో రామ్ చరణ్‌తో పాటు దేశం నలుమూలల నుంచి రప్పించిన ఫైటర్లు పాల్గొంటున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.శ్యామ్ కౌశల్ ఎంట్రీతో మెగా ఫ్యాన్స్‌లో హైప్ మరింత పెరిగింది. “పెద్ది యాక్షన్ పాన్-ఇండియా లెవల్‌లో ఉండబోతోంది”, “బుచ్చిబాబు విజన్ మళ్లీ మరో స్థాయికి వెళ్లింది”, “విక్కీ కాదు… కానీ ఆయన తండ్రి రావడమే సినిమాకి పెద్ద ప్లస్!” అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో షేక్ చేస్తున్నారు. ఇదే విక్కీ కౌశల్‌కు ‘పెద్ది’ సినిమాతో ఉన్న అసలు సంబంధం. నటుడిగా కాకపోయినా, ఆయన కుటుంబం నుంచి వచ్చిన అనుభవజ్ఞుడు ఈ భారీ ప్రాజెక్ట్‌లో పనిచేయడం సినిమా రేంజ్‌ని ఇంకా పెంచుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: