పెళ్లి వేడుక మాత్రం పూర్తిగా సింపుల్‌గా, కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే—ఈ వేడుకకు సమంత తల్లి మాత్రమే హాజరైనట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫిక్స్, పోస్టులు చెబుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఎవరూ ఈ వేడుకకు ఆహ్వానించబడలేదని ప్రచారం జరుగుతున్నా, దీనిపై సమంత లేదా రాజ్ నిడమోరు ఏ అధికారిక ప్రకటన చేయలేదు. సమంత పంచుకున్న ఫోటోల్లో ఆమె ఆనందం అచ్చం కొత్త పెళ్లికూతురి వెలుగులా కనిపిస్తోంది. చేతుల్లో మెరిసే డైమండ్ రింగ్, మెడలో నల్లపూసల దండ, చేతులకు పెట్టుకున్న గోరింటాకుతో సంప్రదాయ సౌందర్యం మరింతగా ప్రతిఫలించింది. రాజ్ నిరుమూరుతో కలిసి నవ్వుతూ, అతని చేయి పట్టుకుని నిలబడ్డ ప్రతి ఫోటో చూస్తుంటే, ఈ కొత్త ప్రయాణంపై సమంత ఎంతగా హ్యాపీగా ఉందో స్పష్టమవుతోంది.
సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తూ, “ఇదే నిజమైన పెళ్లికూతురు లుక్”, “సమంత మళ్లీ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది”, “ఇక నుంచైనా ఆమె జీవితంలో శాంతి, సంతోషాలు నిండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఫన్నీగా, “ఇకపై సమంత రూతు ప్రభువు కాదు… సమంత నిశమోరు అన్నమాట!” అంటూ కూడా సరదాగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సమంత రెండోసారి పెళ్లి చేసుకుంటుందా? లేక ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఒట్టి పుకార్లేనా? అంటూ అనుమానించిన జనాలు ఇప్పుడు సమంత స్వయంగా షేర్ చేసిన ఫోటోలతో నిజాన్ని అర్థం చేసుకున్నారు. రాజ్ నిరుమూరుతో ఉన్న ప్రేమాయణం ఎంత నిజమైనదో, ఎంత బలమైనదో ఈ ఫోటోలు మరింతగా చెబుతున్నాయి. ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లిన ఈ జంట ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలయ్యారు.
అభిమానులు ప్రస్తుతం ఒకటే మాట చెబుతున్నారు—“సమంత ఈ పెళ్లి బంధాన్ని జీవితాంతం ఆనందంగా సాగించాలి… ఆమె మళ్లీ పాత బాధలను మరచి కొత్త జీవితంలో వెలుగులు నింపుకోవాలి.”సమంత షేర్ చేసిన పెళ్లి పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతూ, విపరీతంగా వైరల్ అవుతున్నాయి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి