సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది చాలా సినిమాలలో ఒకే లుక్ లో కనిపిస్తూ ఉంటారు. దానితో ప్రేక్షకులు కూడా ప్రతి మూవీలో ఒకేలా కనిపించే నటీనటుల విషయంలో కాస్త అసలహనం కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఒకే వేషధారణలో , ఒకే లుక్ లో చాలా సినిమాలు నటించినట్లయితే అసలు కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఏ సినిమాలో నటించారు అనేది పెద్దగా అర్థం కాకపోవచ్చు. దానితో చాలా మంది నటీ నటులు సినిమా సినిమాకు కాస్త గెటప్ లేదా లుక్ లో ఏమైనా తేడా చూపిస్తే వాటి ద్వారా వీరు నటించిన సినిమాలను ఈజీగా గుర్తుపట్టొచ్చు. అలాగే వారి నటనలో కూడా కాస్త వేరియేషన్స్ మారిస్తే చాలా బాగుంటుంది అనే అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్త పరుస్తూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో సినిమాకు తన వేరియేషన్స్ ను మారుస్తూ గెటప్లో కాస్త చేంజ్ ను చూపిస్తున్న ముద్దుగుమ్మలలో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఒకరు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఈమెకు బేబీ మూవీ ద్వారా అద్భుతమైన విజయం దక్కింది. ఇక బేబీ మూవీ లో ఈమె క్లాస్ అండ్ అల్ట్రా  మోడరన్ లుక్ లో ఇలా రెండు లుక్ లలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈమె కొంత కాలం క్రితం జాక్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈమె చీర కట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న ఎపిక్ అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఈవెంట్ జరిగింది. ఆ ఈవేంట్ కి వైష్ణవి చైతన్య అదిరిపోయే రేంజ్ డిఫరెంట్ లుక్ లో వచ్చింది. దానితో ఈమె ఈ లుక్ లోనే ఎపిక్ సినిమాలో కనిపించబోతుంది అని ,  వైష్ణవి చైతన్య ప్రతి సినిమాకు తనదైన రేంజ్ లో వేరియేషన్స్ ను చూపిస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vc