మెగాస్టార్ చిరంజీవికి కృష్ణంరాజుకి మధ్య మంచి బాండింగ్ ఉందంటారు ఇండస్ట్రీ జనాలు. ఎందుకంటే కృష్ణంరాజు,మెగాస్టార్ ఇద్దరిదీ మొగల్తూరే కాబట్టి వీరి మధ్య బంధం ఎప్పటినుండో కొనసాగుతోంది.అలా సినిమాల్లోకి చిరంజీవి వచ్చినప్పుడు కృష్ణంరాజు సపోర్ట్ చేశారని చాలామంది అంటారు. అయితే అలాంటి చిరంజీవికి కృష్ణంరాజు ఆయన బర్త్డే రోజు ఒక ఊహించని గిఫ్ట్ ని ఇచ్చారట.ఆ గిఫ్ట్ చూసిన చిరంజీవి ఆనందంతో మైమరిచిపోయారట. మరి ఇంతకీ చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. కృష్ణంరాజు క్షత్రియ వంశానికి చెందినవారు కావడంతో ఆయన గుణగణాలు కూడా రాజుకు ఉన్నట్లే ఉండేవట. ముఖ్యంగా షూటింగ్ సెట్ కి ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ ఇంటి భోజనాన్ని తెప్పించే వారట.చాలా మంచి ప్రవర్తనతో మెదిలేవారట. 

అయితే అలాంటి కృష్ణంరాజు మెగాస్టార్ తో చాలా అనుబంధంగా ఉండేవారు. ముఖ్యంగా ఓ రోజు కృష్ణంరాజు లండన్ కి వెళ్లిన సమయంలో ఒక ఖరీదైన కెమెరా ని కొని తీసుకువచ్చారట. అయితే ఆ కెమెరా లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయట. ఫోటో తీసేటప్పుడు వాళ్ళు ఎండలో ఉన్నా కూడా ఎండ లేనట్లు కూల్ గా చూపిస్తుందట.అలాగే చీకట్లో ఫోటో దించినా కూడా లైటింగ్ కనిపించేదట. అలా చాలా కాస్ట్లీ కెమెరాని కొనుగోలు చేశారట కృష్ణంరాజు. ఇక కాస్ట్లీ కెమెరాని చిరంజీవికి గిఫ్టుగా ఇద్దామని కృష్ణంరాజు అనుకున్నారట. చిరంజీవి బర్త్డే పిలుపు రావడంతో కృష్ణంరాజు తన మేనల్లుడిని తీసుకొని బర్త్డే వేడుకలకు కాస్ట్లీ కెమెరాని పట్టుకొని వెళ్లారట. అలా వెళ్ళిన సమయంలో కృష్ణంరాజు అక్కడ ఫోటోలను క్లిక్ మనిపించే సమయంలో ఆ కెమెరా చిరంజీవి కళ్లలో పడింది .

దాంతో చిరంజీవి ఆ కెమెరాని చూసి ఉప్పొంగిపోయి అన్నయ్య నేను ఈ కెమెరాని లండన్లో చూశాను. చాలా బాగుంది. ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. కానీ కాస్ట్ ఎక్కువగా ఉంది అని వదిలేసి వచ్చాను అని చెప్పారట. ఇక చిరంజీవి మాటలకు కృష్ణంరాజు వెంటనే కెమెరా ఆయన మెడలో వేసి ఇది నీకోసమే తెచ్చాను. బర్త్డే గిఫ్ట్ అంటూ సర్ప్రైజ్ ఇవ్వడంతో చిరంజీవి కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారట. అలా చిరంజీవి బర్త్డేకి కృష్ణంరాజు ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేదట.ఈ విషయాన్ని చాలా సందర్భాలలో చిరంజీవి, కృష్ణంరాజులు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: