ఇటీవల స్త్రీ 2 మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత, డైరెక్టర్ అమర్ కౌశిక్, విక్కీ కౌశల్ తో మహావతార్ తెరకెక్కించబోతున్నట్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ పరుశురాముడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో దీపికను ఎంపిక చేసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తోందట. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ఆమెతో చర్చలు జరిపినట్లు వినిపిస్తున్నాయి. దీపిక పాత్రకు ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉంటుందని ఆ పాత్రకు ఆమె అయితేనే కచ్చితంగా సెట్ అవుతుందని టీమ్ నమ్ముతోంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారని మరి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి మరి. ఇప్పటికే సినిమాలకు సంబంధించి దీపిక అటు రెమ్యూనరేషన్ పెంచడం, టైమింగ్ 8 గంటలపాటే పని చేస్తానని , అలాగే తనతో పాటు వచ్చే స్టాఫ్ కి కూడా నిర్మాతలే ఖర్చులు భరించాలని కండిషన్స్ పెట్టినట్లు వినిపించాయి. మరి ఇప్పుడు మహా అవతార్ సినిమాకి కూడా ఇలాంటి కండిషన్స్ పెడుతుందా ?అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక డైరెక్టర్ అమర్ కౌశిక్ .. మహావతార సినిమా గురించి మాట్లాడుతూ దాదాపుగా ఈ సినిమా కోసం ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరిపానని తెలిపారు. ఈ సినిమా స్టోరీ కూడా తనకు చాలా ఇష్టమని తాను అరుణాచల్ ప్రదేశ్ స్కూల్లో చదివేటప్పుడు తమకు దగ్గరలోనే పరుశురాముడు గుడి ఉండేదని తరచూ అక్కడికి వెళ్లే వాడిని, అక్కడ పరశురాముడి కథలు వినడంతో ఆయన పాత్ర నన్ను బాగా ఆకర్షించింది.. అందుకే నాకు ఈ సినిమా పైన ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిందంటూ తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి