కేవలం కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి… 2025కి బై బై చెప్పి, 2026కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పబోతున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం వెనక్కి తిరిగి ఒకసారి రివ్యూ చేసుకుంటోంది. ఈ ఏడాది సినీ రంగంలో ఏం జరిగింది? ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటిలో ఎన్ని హిట్స్‌గా నిలిచాయి? ఎన్ని సినిమాలు నిరాశపరిచాయి? అసలు 2025లో ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ఏది? అనే అంశాలపై సినీ ప్రేమికులు, ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ లిస్టులో టాప్ ప్లేస్‌లో నిలిచిన సినిమా ఒక్కటే… ‘ఓజీ ’.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్గా నిలిచిన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఓజీ’ సినిమా విడుదలకంటే ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను మించి, ఈ సినిమా బాక్సాఫీస్‌ను పూర్తిగా షేక్ చేసి పడేసింది. ముఖ్యంగా ప్రీమియర్స్ నుంచే ఓ రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఓజీ’, విడుదలైన ప్రతి చోటా అదే ఊపు కొనసాగించింది.


ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…ఈ సినిమాలో కథ పరంగా పెద్దగా కొత్తదనం లేదని, కంటెంట్ సింపుల్‌గా ఉందని మూవీ మేకర్స్ కూడా ఓపెన్‌గా ఒప్పుకున్నారు. అయినప్పటికీ సినిమా ఈ స్థాయిలో హిట్ అవడానికి ప్రధాన కారణం ఒక్కటే – పవన్ కళ్యాణ్ మేనరిజం.ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన హీరోను ఏ విధంగా చూడాలనుకుంటాడో, అదే ఫ్యాన్ పర్స్పెక్టివ్‌లో పవన్‌ను తెరపై చూపించడంలో దర్శకుడు సుజిత్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, నడక, చూపు… ప్రతి ఫ్రేమ్‌లోనూ ఫ్యాన్స్‌కి కావాల్సిన పవన్ కళ్యాణ్‌ను చూపించాడు. ఈ విషయంలో సుజిత్‌పై నో డౌట్.



ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇంటర్వెల్ ముందు వచ్చే సీక్వెన్స్.ఆ సీన్ చూసిన తర్వాత కళ్లుమూసుకున్నా సరే, అదే విజువల్స్ అభిమానుల కళ్ల ముందు తిరుగుతూనే ఉంటాయి. అంత పర్ఫెక్ట్‌గా ఆ సన్నివేశాన్ని డిజైన్ చేశారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్, అందులో పవన్ కళ్యాణ్ తీసుకునే “జానీ గన్” మూమెంట్ అయితే ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఇలాంటి ఐడియాలు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే వస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.



ఇక 2025 సంవత్సరాన్ని మొత్తం పరిశీలిస్తే…ఈ ఏడాది దాదాపుగా 200కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో నిజంగా హిట్‌గా నిలిచింది కేవలం 15 సినిమాలు మాత్రమే అన్నది ఆశ్చర్యకరమైన నిజం. అలాంటి పరిస్థితుల్లో ‘ఓజీ’ సినిమా ఆ లిస్టులో టాప్‌లో నిలవడమే కాకుండా, ఇండస్ట్రీకి గర్వకారణంగా మారింది.సుమారు 308 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే…
సినిమా కలెక్షన్లతో మాత్రమే కాదు, అభిమానుల మనసుల్లో చెరిగిపోలేని స్థానం సంపాదించుకుంది.పవన్ కళ్యాణ్ కెరియర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ, ‘ఓజీ’ మాత్రం ప్రత్యేకంగా గుర్తుండిపోయే సినిమా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ లైఫ్‌లోనే ఇది ఒక మెమొరబుల్ మూమెంట్గా నిలిచిపోయింది.



మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…2025లో ‘ఓజీ’ సినిమాను బీట్ చేసే మూవీ ఒక్కటైనా రాకపోవడం. పాటల పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, నటన పరంగా – ఏ కోణంలో చూసినా ‘ఓజీ’ని మించిన సినిమా ఈ ఏడాదిలో విడుదల కాలేదు.కలెక్షన్ల పరంగా ఫ్యూచర్ లో ఎవరైనా హీరో సినిమా రికార్డులను బ్రేక్ చేయవచ్చేమో గానీ,పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ’కి చూపించిన అభిమానాన్ని, ఆ ఎమోషన్‌ను, ఆ మ్యాడ్‌నెస్‌ను బ్రేక్ చేయడం మాత్రం ఏ స్టార్ హీరో సినిమాకైనా సాధ్యం కాదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మొత్తానికి 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న ఈ సమయంలో,టాలీవుడ్ చరిత్రలో ఈ ఏడాది గుర్తుండిపోయే సినిమా ఏదంటే…ఎలాంటి ఆలోచన లేకుండా వినిపించే పేరు ఒక్కటే –పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.

మరింత సమాచారం తెలుసుకోండి: