అందాల ఆరబోతకే కాకుండా.. నటనలోనూ సత్తా చాటుకున్న అతికొద్ది మంది నటీమణుల్లో అంజలి ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయే అయినా.. ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అటు తమిళంలోనూ అంజలి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 
అంజలి నోట పెళ్లి మాట..


కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు లేని పోని వివాదాలు ఆమెను ఇబ్బంది పెట్డాయి. ఇప్పుడు తెలుగులో కూడా ఈ అమ్మడికి అంతగా అవకాశాల్లేవు. సీతమ్మ వాకిట్లో.. గీతాంజలి తర్వాత చెప్పుకోదగిన ఛాన్స్ రాలేదు. అందుకే అంజలి చూపు పెళ్లిపైకి మళ్లిందని వార్తలు వస్తున్నాయి. 
సినిమాల్లేకపోయినా బిజీనే..


లేటెస్టుగా మీడియాతో మాట్లాడుతూ.. అమ్మానేనూ హైదరాబాద్ లోనే ఉంటున్నామని చెప్పుకొచ్చింది. తల్లి తన పెళ్లి కోసం తొందరపెడుతోందని.. తనకేం తొందరలేదని అంజలి అంటోంది. చేతిలో పెద్దగా సినిమాల్లేకపోయినా.. మూడు భాషల్లో నటించడం వల్ల బిజీబిజీ అంటోంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటే ఇదేనేమో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: