
రానున్న అమెరికా అధ్యక్ష
ఎన్నికలకి ఈ సారి ట్రంప్ తో పాటు పోటీ పడటానికి భారత సంతతి మహిళలు సిద్దంగా ఉన్న
విషయం విధితమే. ఆ ఇద్దరు మహిళలు డెమోక్రాటిక్ పార్టీ తరుపున పోటీ కి సిద్దమవడం ఆసక్తిగా
మారింది. అయితే వారిలో కమలా హారీస్ ప్రచారంలో మాత్రమే కాదు ట్రంప్ కి తీసిపోని
విధంగా అన్ని విధాలుగా దూసుకుపోతున్నారు. ట్రంప్ చేయలేని ఒక పనిని చేసి చూపించి
వార్తల్లో నిలిచారు. దాంతో కమలా హారీస్ కి ఉన్న గట్స్ ట్రంప్ కి లేవా అనే కామెంట్స్
కూడా వినిపిస్తున్నాయి.ఇంతకీ ఆమె చేసింది ఏమిటి అంటే...
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తులు తాము కట్టిన పన్నుల వివరాలు విడుదల చేయాలని 2017లోనే ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే ఈ ప్రతిపాదనకి రిపబ్లికన్ పార్టీ అడ్డుపడింది. కానీ ఈ నిర్ణయానికి కమలా కట్టుబడి ఉన్నారు అందుకు తగ్గట్టుగానే. ఆమె తాను కట్టిన పన్నుల వివరాలని మీడియా కి తెలిపారు.
2004 నుంచీ 2018 వరకు తాను ప్రభుత్వానికి కట్టిన పన్నుల వివరాలు కమలా విడుదల చేశారు. 2014 లో తన భర్తని పెళ్లి చేసుకున్న సమయం మొదలు ఇప్పటి వరకూ కూడా ఇద్దరూ కలిసి చెల్లించిన ట్యాక్స్ లు 32.7 శాతం ఉన్నాయి. కేవలం ఒక్క 2018లోనే వీరి ఇరువురి ఆదాయం దాదాపు 13 కోట్లు కాగా అందులో 5 కోట్ల రూపాయలు పన్నులు తాము కట్టినట్టుగా తెలిపారు. కానీ ఇప్పటి వరకూ కూడా ట్రంప్ ఏనాడు ట్యాక్స్ ల వివరాలు బయటపెట్టక పోవడంతో ట్రంప్ కంటే కమలా హారీస్ కి గట్స్ ఎక్కువ అంటూ తెగ పొగిడేస్తున్నారు అమెరికన్స్.