అమెరికాలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. వేలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. న్యూయార్క్ నగరమంతా అంధకారంలో ఉండిపోయింది. యూనివర్సిటీలు, స్కూల్స్, హాస్టల్స్ , సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇలా అన్నీ షట్ డౌన్ చేసేశారు.దాంతో భారతీయులకి దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యార్ధులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే...

IHG

ఇమ్మిగ్రేషన్ పై వస్తున్న ఎన్నో సందేహాలు అందరిని కలిచివేస్తున్నాయి. దాంతో తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) ఇమ్మిగ్రేషన్ పై వస్తున్న సందేహలని నివృత్తి చేసేందుకు అటార్నీ తో కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసింది. కోవిడ్ -19 ఎంప్లాయిమెంట్ ఆధారైజేషన్ 1-9 వెరిఫికేషన్ , రిమోట్ వర్క్ ,ట్రావెల్ పై ఆంక్షలు ఇతరాత్రా సందేహాలపై ఈ కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసినట్టుగా తానా తెలిపింది. తెలుగు వారు, ప్రతీ భారతీయులు ఈ కాన్ఫరెన్స్ కాల్ ని సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించింది.

IHG

ఈ కాన్ఫరెన్స్ కాల్ ని బీబీఐ లా గ్రూప్ కి చెందిన  ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను బాబు ఇలింద్రా తో ఏర్పాటు చేసినట్టుగా సంస్థ సభ్యులు తెలిపారు. మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ కాన్ఫరెన్స్ కాల్ కార్యక్రమం జరుగుతుందని సందేహాలు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు తానా అధ్యక్షులు జై తాళ్ళూరి.

TOLL FREE – 605-313-4100

PIN – 695578#

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: