దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి వలస కార్మికులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  అయితే ఇలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నా.. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు మాత్రమే కాదు మనసున్న మారాజులు ఎంతో మంది ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందిస్తున్నారు.  గత కొన్ని రోజులుగా నాట్స్ తెలుగు రాష్ట్రంలో ఉన్న పేదల ప్రజలకు తమవంత సహాయం గా నిత్యావసర సరుకులు అందిస్తూ కరోనా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.  

 

 

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో వలస కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగునాట వలస కూలీల పరిస్థితి తెలుసుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. శ్రీకాకాళం జిల్లా సంతబొమ్మాళి మండలం పెద్ద మర్రిపాడు గ్రామంలో  100 కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది. ఇక్కడ పరిస్థితిని సెయింట్ లూయిస్ పెద్దలు, స్థానిక తెలుగు సంఘం (TAS Secretary) రమేష్ కొందముట్టి, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి తన వంతు సాయం చేశారు.

 

 

100 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీకి కావాల్సిన సాయాన్ని  చేసి మానవత చాటుకున్నారు. వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తమ దృష్టికి తెస్తే వెంటనే తాము తగిన సాయం చేస్తున్నామని నాట్స్ తెలిపింది. అంతే కాదు తమ సేవలు మరింత ఎక్కువ చేస్తామని... కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని తమ వంతు ఆదుకుంటామని అంటున్నారు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి. 

మరింత సమాచారం తెలుసుకోండి: