భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ఉన్నా సరే  ఐటీ కంపెనీలతో పాటు పలు కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. దీంతో వారికి భారీగా రాయితీలు కూడా ఇస్తున్నాయి. అందుకే ఇతర దేశాలకు చెందిన పలు కంపెనీలు కూడా ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలోనే భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారై లు కూడా ఎక్కువ గానే ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమానికి ఇప్పుడు ఎన్నారైలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యూరప్ అమెరికా దేశాల్లో ఉండే ఎన్నారైలు భారత్ లోకి తిరిగి వచ్చే ఆలోచనలు ఉన్నారనే వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు వారు మార్గం సుగమం చేసుకుంటున్నారని తెలుస్తుంది.

దాదాపు కోటి నుంచి పది కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే ఎన్నారై లు ఇప్పుడు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఎన్నారైలు ఇప్పుడు భారత్ లోకి వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విదేశాల్లో కీలక కంపెనీల్లో పని చేస్తున్న చాలా మంది ఎన్నారైలు ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితులను మనం చూశాం. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా మన దేశంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఎంత మంది ఎన్నారైలు భారత్ లో పెట్టుబడులు పెడతారు అనేది చూడాలి. ఇదే జరిగితే మాత్రం మోడీ దాదాపుగా ఈ విషయంలో సక్సెస్ అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: