అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు ఇండియా ఓట్ల మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఇండియాన్స్ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు. ఇక సర్వేలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. గెలిచే ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడే ట్రంప్ రేపు గెలిచిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే తమ భవిష్యత్తు ప్రమాదకరం అని భావిస్తున్నారు చాలా మంది.

రాజకీయంగా ఇప్పుడు అమెరికాలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా కూడా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. జో బిడెన్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా  కనపడుతున్నాయి. అయితే ఎన్నారై లను టార్గెట్ చేసుకోవడానికి గానూ రాబోయే పది రోజుల్లో ట్రంప్ ఒక ప్లాన్ తో ముందుకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల లోపు కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఇండియా తో ఒక ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని ఆయన భావిస్తున్నారు.

భారత్ లో ఉన్న ఒక ప్రముఖ కంపెనీతో అమెరికా ఒప్పందం చేసుకుని, నిధులను కూడా అందించే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఏ విధంగా అడుగులు వేస్తారు ట్రంప్ అనేది చూడాలి. ఎన్నారై లను ఆకట్టుకోవడానికి భారత్ తో వాణిజ్య ఒప్పందం కూడా జరిగే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. మరి ఏ విధమైన ఒప్పందం ట్రంప్ చేసుకునే అవకాశం ఉంది అనేది చూడాలి. ఇక అమెరికాలో అయితే చాలా వరకు ఇండియాన్స్ ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని, చాలా మంది ఓటింగ్ కి దూరంగా ఉండే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. మరి ఏమవుతుంది అనేది చూడాలి. నవంబర్ 3 న అక్కడ ఎన్నికలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: