అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బిడెన్ ,కమలా హారీస్ లు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అన్ని సిద్దమయ్యాయి. అత్యంత కట్టుదిట్టమైన బద్రతల మధ్య ఇరువురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముస్తాబవ్వాల్సిన వాషింగ్టన్ ఎఫ్బిఐ హెచ్చరికల కారణంగా నిర్మానుష్యంగా తయారయ్యింది. అమెరికా క్యాపిటల్ భవనం జాతీయ బలగాల ఆధీనంలో ఉంది. వాషింగ్టన్ మొత్తాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కొన్ని గంటలలో బిడెన్, కమలా హారీస్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు..ఈ నేపధ్యంలో
బిడెన్ ప్రమాణ స్వీకారానికంటే కూడా మన కమలా హారీస్ ప్రమాణ స్వీకారంపై అందరి దృష్టి పడింది. ఎప్పుడెప్పుడు కమలా ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తారోనని ప్రతీ ఒక్క భారతీయుల కళ్ళు ఎదురు చేస్తున్నాయి. ఎందుకంటే కమలా హారీస్ ప్రమాణ స్వీకారానికి భారతీయ సాంప్రదాయమైన చీరకట్టులో రానున్నారట. చీరకట్టులోనే కమలమ్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా నడుస్తోంది. కమలా హారీస్ చీరలో కనపడుతారని మెజారిటీ వర్గం అంటుంటే.కాదు కాదు సూట్ లో కనపడుతారని మరికొందరు వాదిస్తున్నారు. దాంతో ఆమె ఎంట్రీ పై సర్వాత్రా ఆసక్తి  నెలకొంది..అయితే
కమలా హరీస్ అత్యధిక శాతం చీరకట్టులోనే వస్తారని అంటున్నారు ఆమె సన్నిహిత వర్గాలు. అందుకు కారణం లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలా హరీస్ ఆసియా అమెరికన్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనారు.ఆ సమయంలో ఓ మహిళ మీరు గెలిస్తే ప్రమాణ స్వీకారం చీరకట్టులోనే చేస్తారా అని ప్రశ్నించినపుడు, ముందు గెలవనివ్వండి తరువాత అదే జరుగుతుందేమో అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు నేట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కమలా తపపకుండా చీరకట్టులోనే ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ నెటిజన్లు ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక వేళ నిజంగా మన కమలా హారీస్ చీరకట్టులో వేదికపై నుంచుని ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆహా..భారతీయులందరికీ కన్నుల పండుగే మరి...
                                                                                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: