ప్రపంచ దేశాలు మొత్తం ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని దేశాలలో కూడా ఇదే చర్చనీయాంశంగా మారిపోయింది. దాదాపు రెండు వారాల గడిచిపోతున్నాయి. అటు రష్యా ఉక్రెయిన్ పై ఎడతెరిపి లేకుండా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రపంచ దేశాల మొత్తం  యుద్ధ పరిస్థితుల గురించి చర్చించుకుంటూ ఉంటే అటు ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత పాలన కు కేరాఫ్ అడ్రస్ అయిన కిమ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు.


 గత కొంతకాలం నుంచి ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం వేధిస్తూ ఉన్నప్పటికీ అటు దేశ ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తూ అర్థ నాదాలు  చేస్తున్నప్పటికీ అవన్నీ పట్టించుకోని కిమ్ జాంగ్ ఉన్.. ఇక వరుసగా క్షిపణులను ప్రయోగించడం లాంటివి చేస్తూ ఉన్నాడు.  అగ్ర దేశమైన అమెరికా ఉత్తర కొరియా పై ఆంక్షలు విధిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు అని చెప్పాలి. ఇక ఇటీవలే మరోసారి సుదూర లక్ష్యాలను ఛేదించగల  క్షిపణి నీ కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగంలో కిమ్ కు ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది.


 ఉత్తర కొరియా రాజధాని నగరం నుంచి ప్రయోగించిన క్షిపణి గాలిలో పేలిపోయి విఫల ప్రయోగం గా మిగిలిపోయింది. తన అమ్ముల పొదిలోని అతిపెద్ద సుదూర లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి ప్రయోగించింది ఉత్తర కొరియా ప్రభుత్వం. కానీ ఇది ఫెయిల్ అయింది. అయితే ఈ ఏడాది ఉత్తరకొరియా జరిపిన వాటిలో ఇది పదవ ప్రయోగం కావడం గమనార్హం. ఇక తన ఆయుధాలను ఆధునీకరించుకుంటున్న ఉత్తర కొరియా ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావాలని వ్యూహంతో ముందుకు సాగుతుందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: