కరోనా వైరస్ ప్రభావాన్ని తీవ్ర స్థాయిలో ఎదుర్కొన్న దేశాలలో బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది అన్న విషయం తెలిసిందే. అధునాతనమైన వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం కరోనా వైరస్ బారినపడి పిట్టల్లా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక బ్రిటన్లో పరిస్థితులు చూసి ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక బ్రిటన్లో అన్ని దశలో కూడా కరోనా వైరస్ విజృంభించింది అని చెప్పాలి. ఇలా వైరస్ విజృంభించిన సమయంలో అక్కడి ప్రభుత్వం వైరస్ను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది.


 ఈ క్రమంలోనే కఠినమైన లాక్డౌన్ విధించి అన్ని రకాల కార్యక్రమాలపై నిషేదాజ్ఞలు విధించడమే కాదు ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటూ నిబంధన పెట్టింది. ఇలా ప్రజలు అందరూ కరోనా వైరస్ నిబంధనలు పాటించాలని రూల్స్ పెట్టిన ప్రధానమంత్రి నిబంధనలు ఉల్లంఘించడం సంచలనంగా మారిపోయింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ ఏకంగా ఎక్కడ కరోనా నిబంధనలు పాటించకుండా తన ప్రభుత్వంలోని నేతలు అధికారులతో ఒక మద్యం పార్టీలో పాల్గొన్నారు. ఇది కాస్త కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.


 ఇదే విషయంపై స్పందించిన ప్రతిపక్ష పార్టీలు బోరిస్ జాన్సన్ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ విషయంపై విచారణ చేసిన బోరిస్ జాన్సన్ నిబంధనలు ఉల్లంఘించారు అన్న విషయం తేలింది. ఈ క్రమంలోనే ఇటీవల బ్రిటన్ పార్లమెంట్ వేదికగా క్షమాపణలు చెప్పారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఈ మద్యం పార్టీపై నిజానిజాలు తేల్చేందుకు  ఏర్పాటు చేసిన గ్రే కమిషన్ తన నివేదికను సమర్పించింది. మద్యం విందులో సీనియర్లే నాయకత్వాన్ని బాధ్యత వహించాలని నివేదికలో స్పష్టం చేసిన నేపథ్యంలో స్పందించిన బోరిస్ జాన్సన్ తన తప్పును అంగీకరిస్తూ పార్లమెంట్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ముందుకు కదులుదాం అని ప్రభుత్వ ప్రధాన్యత పై దృష్టి పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: