
ఇక్కడ ఒక వ్యక్తి క్రియేటివిటీ చూసి ప్రస్తుతం నెటిజన్స్ అందరు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మండుతున్న ఎండలకు కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. కారు ఉంటే తప్ప ఎక్కడికైనా ప్రయాణం చేయాలని ఆలోచన చేయడం లేదు ఎవరు కూడా. అలాంటిది బైక్ లేదా సైకిల్ పై వెళ్లడం అంటే ఇక నరకప్రాయం అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఎండలకు బయటకు వెళ్లాలంటే అతను భయపడిపోయాడు. అలాగని కారు కొనే స్తోమత కూడా లేదు. కేవలం అతని దగ్గర సైకిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ వృద్ధుడు వినూత్నమైన ఆలోచన చేశాడు. ఎండ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా సైకిల్ ని ఒక కారు లాగా మార్చేసాడు.
ఏకంగా తన దగ్గర ఉన్న సైకిల్ ని ఎండ వర్షం బారి నుంచి తప్పించుకునే విధంగా తయారు చేసుకున్నాడు. రూపాయి ఖర్చు లేకుండానే సైకిల్ పై హాయిగా ప్రయాణం చేయాలనుకున్న అతని కల చివరికి సహకారమైంది. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. కొన్ని కర్రలను తీసుకొని సైకిల్ చుట్టూ సమాంతరంగా పేర్చి పందిరిలా కట్టాడు. ఇక పైన ఎండ తగలకుండా వర్షం పడకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇలా సైకిల్ ను సిద్ధం చేసుకుని రోడ్డుపై కూల్ గా ప్రయాణం సాగించాడు ఆ వృద్ధుడు. అతని తెలివితేటలు చూసి అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారగా.. ఆ పెద్దాయన క్రియేటివిటీ మామూలుగా లేదే అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.