వయస్సుకు, టాలెంట్ కు సంబంధం లేదు. చిన్న వయస్సు లోనే కొంత మంది పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. అంతే కాకుండా తమ టాలెంట్ తో కోట్లాది రూపాయాల డబ్బులు చిన్న వయస్సు లోనే సంపాదిస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. కోటీశ్వరులుగా మారడానికి వయస్సు తో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. ఇలాంటి కొంత మంది చిన్నారుల గురించి అప్పడప్పుడు బాగా చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా ఒక 11 ఏళ్ల చిన్నారి యూట్యూబ్ ద్వారా కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తోంది.

యూట్యూబ్ లో చాలా మంది పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్ చానెళ్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ప్రజలకు నచ్చే కంటెంట్ ను అందిస్తూ యూజర్లను సంపాదించుకుంటున్నారు. దీని ద్వారా వారికి ఎంతో ఆదాయం వస్తుంది. యూట్యూబ్ చానెల్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించే యూట్యూబర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ఒక చిన్నారి కూడా యూట్యూబర్ గా మారి రూ.కోట్లు సంపాదిస్తోంది. యూట్యూబ్ వీడియోలను చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన 11 సంవత్సరాల ష్ఫా అనే ఈ చిన్నారి పిల్లలకు ఉపయోగకరమైన వీడియోలు చేస్తూ తక్కువ కాలం లోనే బాగా పాపులర్ అయింది. అరబిక్ బాష లో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయింది.

అమ్మాయి ష్పా యూట్యూబ్ చానెల్‌కు 40 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.  2015 మార్చి 29న యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.  ష్పా యూట్యూబ్ ఛానెల్ ఇప్పటికే 22 మిలియన్లకుపైగా వీక్షణలను పొందింది. దీంతో 2023 మే నాటికి 2 లక్షల డాలర్ల ఆదాయం వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.కోటి కంటే ఎక్కువ.  ఒక్కొక్కసారి నెల సంపాదన 3,00,000 డాలర్లు కూడా వస్తోంది.   8 సంవత్సరాల్లో 984 వీడియోలను పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: