గ్లోబలైజేషన్ విధానంలో 1992 తర్వాత ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. అయితే ప్రతిదేశం మరో దేశంతో వ్యాపార సంబంధాలు పెంచుకుని ఆర్థిక వ్యవస్థల్ని మెరుగుపరుచుకుంటూ పోవాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే వ్యాపారాల వరకు బాగానే ఉన్నా.. రాజకీయాల వరకు ప్రయత్నించడంతోనే అసలు సమస్యలు మొదలయ్యాయి.


ట్రంపు గెలవడానికి రష్యా తెర వెనక ప్రయత్నాలు చేసిందని అమెరికాలోని కొన్ని నిఘా సంస్థలు చెప్పాయి. అదే సమయంలో బైడెన్ ను అమెరికా అధ్యక్షుడిగా కాకుండా చేసేందుకు వీలైనన్నీ ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. కెనడా విషయంలో కూడా చైనా ఇదే విధంగా వ్యవహరించిందని పేర్కొన్నాయి. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా ఎన్నికయ్యే విషయంలో చైనా జోక్యం చేసుకుందని  విమర్శలు వచ్చాయి. ఇలా ఒక దేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో మరో దేశం తలదూర్చడం అనేది సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


వ్యాపార వాణిజ్య సంబంధాలు అనేవి సాధారణం. ఆర్థిక పరమైన అంశాలను ఏ విధంగానైనా చర్చించుకోవచ్చు. కానీ ముఖ్యమైన విషయాలను పక్కనపెట్టి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుంది. మరో వైపు రష్యా ఎన్నికల్లో కూడా అమెరికా వేలు పెట్టినట్లు తెలుస్తోంది. పుతిన్ కు వ్యతిరేకంగా అమెరికా, యూరప్ దేశాలు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇండియాలో కాంగ్రెస్ గెలిస్తే నరేంద్ర మోదీలా కాకుండా చైనాకు సహకరించవచ్చనే అభిప్రాయాలు కొంతమందిలో వ్యక్తమవుతున్నాయి.  


ప్రస్తుతం ఇదే విధంగా అమెరికా మాజీ అధ్యక్షుడిని పుతిన్ పొగడడం వెనక బలమైన కారణాలు ఉన్నట్లు అర్థం అవుతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యాక రష్యాకు పూర్తి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు మళ్లీ అమెరికా ఎన్నికలు రాబోతున్నాయి. ట్రంపు మళ్లీ గెలవాలని రష్యా కోరుకుంటోంది. దీంతో రష్యాకు ట్రంపుకు మధ్య సంబంధాలు ఉన్నట్లు ప్రత్యక్షంగానే తెలుస్తుందని కొంతమంది ప్రపంచ మేధావులు భావిస్తున్నారు. ఇదే జరిగితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: