దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగడం లేదు. ఇరుదేశాల మధ్య బాంబుల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సామాన్య పౌరులు అందరూ కూడా ఏ క్షణంలో ఎటువైపు నుంచి బాంబు వచ్చి మీద పడుతుందో అని అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా ఉక్రెయిన్ ను యూరోపియన్ యూనియన్ లో చేరకుండా ఆపేందుకు రష్యా.. ఇక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్.. ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా సహా మరికొన్ని దేశాలు ప్రయత్నించిన అవి విఫల ప్రయత్నాలు గానే మిగిలిపోయాయి అని చెప్పాలి.



 అయితే చిన్న దేశం అయినప్పటికీ అటు యూరోపియన్ యూనియన్ దేశాల సహకారంతో ఇక ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగిన రష్యాతో ఇక ఎంతో దీటుగా యుద్ధం చేయగలుగుతుంది ఉక్రెయిన్. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ పైచేయి సాధిస్తూ ఉండడం గమనార్హం. రష్యా కు దీటుగా ఉక్రెయిన్ కూడా బాంబుల వర్షం కురిపిస్తుంది. కాగా ఇటీవల రష్యాను చిన్న దేశమైన ఉక్రెయిన్ చావు దెబ్బ కొట్టింది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.


 ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎస్బియు, సైన్యం కలిసి భారీ డ్రోన్లతో రష్యాపై దాడి చేశాయి. అయితే ఈ దాడిలో సౌత్ రోస్టవ్ లోని మరో జోవ్క్స్ వైమానిక స్థావరంలోని ఆరు యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే భద్రతా దళాలకు చెందిన దాదాపు 20 మంది సిబ్బంది మరణించినట్లు తెలుస్తుంది. ఇక ఈ దాడితో ఒక్కసారిగా రష్యా ప్రభుత్వం ఉలిక్కిపడింది అని చెప్పాలి. కాగా ఈ దాడిని తామే చేసినట్లు ఇటీవలే ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా యుద్ధంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఉక్రెయిన్ రష్యాను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: