ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ప్రపంచమంతా పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి ఇంటర్నెట్ యుగంలో ఎక్కడో ప్రపంచ నలుమూలలో జరిగిన ఘటన కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే  ప్రతి రోజు ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి విషయాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని ఘటనలు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 సాధారణంగా వైద్యుల వద్దకు ఎవరైనా పేషెంట్ వెళ్ళినప్పుడు ఇక వారిలో ఉన్న లక్షణాలను బట్టి, పరీక్షలు చేయించి ఇక వారు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారు అన్న విషయాన్ని వైద్యులు ఎంతో సులభంగా కనిపెట్టేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాస్త అనుభవం ఉన్న వైద్యులు అయితే మనిషిని చూడగానే వారికి ఉన్న వ్యాధి ఏంటో అన్న విషయాన్ని చెప్పేస్తూ ఉంటారు. కానీ దానిని కన్ఫార్మ్ చేసుకోవడానికి ఇక వైద్య పరీక్షలు చేయడం చేస్తూ ఉంటారు.


 కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రకరమైన ఘటన జరిగింది. ఏకంగా 17 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యుడు కనిపెట్టలేని వ్యాధిని ఆ వైద్యుడు ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి కనిపెట్టింది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా.. ఈ విషయాన్ని ఎవరో కాదు సదరు వైద్యుడు చెప్పుకొచ్చాడు. తన 17 ఏళ్ళ అనుభవం కనిపెట్టలేని వ్యాధిని.. తన ఇంట్లో పనిమనిషి 10 సెకండ్లలో గుర్తించింది అంటూ కేరళ వైద్యుడు డాక్టర్ ఫిలిప్స్ తనకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నాడు. వైరల్ హైపర్టైటిస్ నుంచి డెంగ్యూ వరకు అన్ని టెస్టులు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇంతలో మా పని మనిషి వచ్చి అది అంజాంఫని (ఫిఫ్త్ డిసీస్) అని చెప్పుకొచ్చింది. తన మనవళ్లలో కూడా ఇలాంటి లక్షణాలు చూశానని తెలిపింది. వెంటనే దానికి సంబంధించిన పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో తాను ఎంతగానో ఆశ్చర్యపోయాను అంటూ డాక్టర్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: