ఐటీ గ్రిడ్స్ మరియు బ్లూ ఫ్రాగ్ కంపనీల పేర్లు డేటా చౌర్యం  “సమాచార చౌర్యం" కేసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య వీటికి సంభందించిన కేసులు సంఘర్షణకు దారితీస్తున్నాయి. పలువురు బడా బడా నాయకులకు ఈ కేసుతో సంబంధమున్నట్లు వస్తున్నవార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయా నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. డేటా చౌర్యం తీవ్ర మైన నేరం. ఈ నేరం ఋజువైతే పెద్ద తలకాయలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

 

సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. తస్కరణకు గురైంది కేవలం ఏపీ పౌరుల సమాచారమేనా? తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారా నికీ ముప్పు వాటిల్లిందా? అనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ సమాచారం ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. “అయ్యప్ప సొసైటీ-మాదాపూర్” లోని ఐటీ గ్రిడ్స్ కంపెనీ లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ ల ను విశ్లేషిస్తున్నారు. వాటిని డీకోడ్ చేస్తే, ఎన్ని ఓట్లు తొలగించారు? ఎలా తొలగించారు? ఎంతమంది ఓట్లు గల్లంతయ్యాయి? ఎంతమంది ఆధార్ డేటాను సేకరించారు? అనే అంశాలను సులభంగా తెలుసుకోవచ్చు.

Image result for data theft in AP 

అధార్ వివరాలు కొన్ని ప్రభుత్వ సాధికారసంస్థలు తప్ప వేరేవారు వినియోగించుకునే అవకాశమే లేదు. బాంకులు కూడా తమ కష్టమర్స్ ను ప్రొద్బలం చేసి కూడా అడగరాదు. అలాంటి భధ్రతా పరమైన అత్యంత విలువైన సమాచారం పూర్తిగా ప్రభుత్వవ్యవస్థల పరిదిదాటి బయటకు రాకూడదు. అలాంటిది అవుట్ సోర్స్ వ్యాపారం చేసుకునే వారి చేతికి ఇంతటి విలువైన - అదీ ఐదు కోట్ల ప్రజల సమాచారం చేరితే – ఆపై చేతులు మారితే ప్రజల సమాచార భద్రత మాటేమిటి?

Tention In AP Employees On It Grid Data Leakage - Sakshi 

డేటా చౌర్యం కేసులో టీడీపీ నాయకులతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా “ఐటీ గ్రిడ్స్ కంపెనీ సీఈవో అశోక్ ఏపీ మంత్రి - టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు” అని సమాచారం. నిన్న ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులను అశోక్ ఖాతరు చేయకపవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు దగ్గర సంబంధాలున్నవారే అలా చేయగలరని పలువురు విశ్లేషిస్తున్నారు. పోలీసులను ధిక్కరించే సాహసం సాధారణ వ్యక్తులు చేయలేరని సూచిస్తున్నారు.

Image result for data theft in AP 

అశోక్ తనకు సన్నిహితుడు అంటూవస్తున్న వార్తలపై నారాలోకేష్ మౌనం ప్రజల్లో తీవ్ర భయానికి కారణమౌతుంది. డేటా చౌర్యం కేసుపై కూడా ఆయన స్పందించడం లేదు కదా! మౌనం ప్రశ్నార్థకంగ మారిందని రాజకీయ విశ్లేషకుల భావన. లోకేష్-అశోక్ కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ గా అవుతున్నాయి. మరోవైపు - ఈ కేసులో ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు రేగొండ భాస్కర్, కడులూరి ఫణి, గురుడు చంద్రశేఖర్, మరల  రెబ్బాల విక్రమ్ గౌడ్లను సోమవారం తమ ముందు హాజరు పరచాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

ఈ కేసులో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐటీ గ్రిడ్స్ ఉద్యోగుల జాడ తెలియడం లేదని దాఖలైన “హెబియస్ కార్పస్ రిట్ పిటీషన్” ను హైకోర్టు కొట్టి వేసింది. ఆ ఉద్యోగులు తమ అదుపులో ఉన్నారని తెలంగాణ పోలీసులు వారి ని కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రిట్ ను కొట్టివేసింది తెలంగాణా హైకోర్ట్. అంతేగాక.. ఈ కేసు విచారణలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. డేటా దొంగతనం కేసులో విచారణపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు  స్పష్టం చేసింది.

Image result for data theft in AP  

ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏమిటంటే హెబియస్ కార్పస్ రిట్ ను హైకోర్టు విచారణకు స్వీకరించగానే ఏపీ మంత్రి నారాలోకేష్ వరస ట్వీట్లతో ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఈ కేసు విచారణలో హైకోర్టులో తెలంగాణా దొరకథ అయిపోయిందని అన్నట్టుగా కేసీఆర్ ను ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేశారు. అలా ఆనందపడ్డ లోకేష్ కు ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలినట్టే. ఉద్యోగులు మిస్ అయ్యారని దాఖలైన రిట్ ను కోర్టు కొట్టివేసింది. వారు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా ధ్రువీకరించింది. మరి ఇప్పుడు లోకేష్ ఎలా స్పందిస్తారో? ఇక ఈ కేసులో మరో కీలక వ్యక్తి కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు.

 

అశోక్ అనే వ్యక్తి ఈ కేసులు  ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. అయితే అతడి జాడ చిక్కడంలేదు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో అతడి గురించి పోలీసులు వేటసాగుతూ ఉందని సమాచారం. మరి ఈ కేసులో వకాల్తా పుచ్చుకుని, ఐటీ గ్రిడ్స్ ను వెనకేసుకు వస్తున్న ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రి నారాలోకేష్, ఈ పరారీ గురించి ఏమంటారో! ఉత్తముడైన  ఆ ‘ఐటీ సంస్థ ఉద్యోగి’ ఎందుకు పారిపోయారో చెప్పాల్సింది లోకేష్ గారి తండ్రి గారే!

Related image

ఏపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న డేటా చోరీ  స్కాం బయటకు రావడంతో అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది ఎవరి గుట్టు బయటపడు తోందోనని ఆందోళన చేందు తున్నారు. దీనిలో అధికారులు పాత్ర ఉందా? లేక ఉద్యోగుల పాత్ర ఉందా?  అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. "రియల్‌ టైం గవర్నెన్స్‌, 1100, ప్రజాసాధికార సర్వే డేటా వంటి సంస్థలపై పలు అనుమానాలు వ్యక్తమతున్నాయి. ప్రభుత్వం  వాటిలో ముఖ్యమైన పౌర సమాచారాన్ని భద్రపరిచింది.


ప్రభుత్వం పథకాల అర్హులను గుర్తించేందుకు గతంలో లబ్దిదారుల ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడా సమాచారం చోరీకి గురైందన్న ఆరోపణలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. డేటా చోరీ కేసులో మాజీ ఐఏఎస్‌ అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. మంత్రి లోకేష్‌ టీం ప్రమేయం పైనా టీడీపీలో చర్చజరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: