పవన్ కళ్యాణ్ .. సరికొత్త రాజకీయాలు చేస్తానని ఇన్ని రోజులు చెప్పాడు. ఇప్పుడు దానికి విరుద్ధంగా తప్పుడు ఆరోపణలతో పచ్చి అబద్దాలతో తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడు. ఎంత కసిని దాచుకున్నాడో కానీ.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తన కసినంతా చూపించేశారు. తిరుపతి ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు అత్యంత విడ్డూరంగా ఉన్నాయి. జగన్ మీద విషం కక్కిన తీరుగా పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు. అబద్ధాలు, అసంబద్ధ వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ తిరుపతి సభలో రెచ్చిపోయారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.


‘జగన్ మోహన్ రెడ్డి చెప్పులు వేసుకుని తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు’. ‘జగన్ ఇంటిముందు నడిచి వెళ్లాలంటే దళితులు చెప్పులు తీసి చేతులో పట్టుకుని వెళ్లాలి’. ‘దళితులు ఎన్నిరోజులు భూమన కరుణాకర్ రెడ్డి, జగన్ పల్లకి మోస్తారు’. ‘భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు శ్రీవారి నగలు మాయం అయ్యాయి..’ ఇవీ పవన్ కల్యాణ్ ప్రసంగంలోని కొన్నిమాటలు. ఎక్కడా చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకురాకుండా జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన విషయాన్ని కక్కారు పవన్ కల్యాణ్. ఇక్కడ విషం అనేమాటను ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే.. పవన్ కల్యాణ్ చేసిన వాటిల్లో పూర్తిగా తప్పుడు, అసంబద్ధమైన ఆరోపణలున్నాయి.


 తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి జగన్ చెప్పులు వేసుకెళ్లారు అనేది శుద్ధ అబద్ధం. అందుకు సంబంధించిన ఫొటోలే అందుకు సాక్ష్యం. ఆఖరికి రాజకీయానికి పవన్ కల్యాణ్ ఇలా శ్రీవారిని కూడా వాడుకోవడం విచారకరం. తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కాదు ఆ విషయాన్ని పవన్ గుర్తించాలి. అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడికేదో భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ అధికారం చలాయిస్తున్నట్టుగా పవన్ మాట్లాడారు. ఇక శ్రీవారి నగలు పోయాయనే ఆరోపణ వచ్చింది భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కాదు.


ఈ అజ్ఞాన వాసికి తెలియదేమో.. శ్రీవారి నగలు పోయాయనే ఆరోపణ వచ్చింది ఇటీవల. చంద్రబాబు సీఎం అయ్యాకా. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం నుంచి వందల కోట్లరూపాయల విలువైన కిరీటాలు మాయం అయితే ఇప్పటికీ ఆ విషయంలో చర్యలులేవు. ఇక దళితులకు జగన్ ఇచ్చే గౌరవం ఏమిటో అభ్యర్థుల ప్రకటననాడు స్పష్టం అయ్యింది. ఏ మాత్రం రాజకీయ నేఫథ్యం లేని ఒక సాధారణ స్థాయి తన పార్టీ కార్యకర్త, పేద దళితుడు అయిన నందిగం సురేష్ ను పక్కన కూర్చోబెట్టుకుని జగన్ అభ్యర్థుల ప్రకటన కూడా ఆయనతో చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: