ఏపీలో తాజా ఎన్నికల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అచ్చంగా 23 సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చారు. 151 సీట్లతో వైసీపీ బంపర్ మెజారిటీ కొట్టి అధికారం హస్తగతం చేసుకుంది. దాంతో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏపీ అసెంబీలో కొత్త ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు.


అయితే ప్రధాన ప్రతిపక్షం హోదా  కావాలంటే  18 మంది ఎమ్మెల్యేలు పక్కాగా  ఉండాలి. టీడీపీకి ఉన్నది 23 మంది. దాంతో చంద్రబాబు క్యాబినెట్ ర్యాంక్ తో అపోజిషన్ లీడర్ గా ఉంటారు. ఇదిలా ఉండగా టీడీఎల్పీలో త్వరలో  పెద్ద చీలిక వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారని న్యూస్ పుకార్లు చేస్తోంది.


వారంతా మొదట వైసీపీలోకే వెల్దామనుకున్నా జగన్ చేర్చుకోరు. దాంతో బీజేపీ వైపు వెళ్ళాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో చాలా పనులు అవుతాయని, ఇక్కడ కూడా దర్జా చలాయించవచ్చునని భావిస్తున్నారుట. అదే జరిగితే టీడీఎల్పీ రెండుగా చీలడం ఖాయం. అపుడు చంద్రబాబు కు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. మామూలు ఎమ్మెల్యే అయిపోతారు.


మరి దీని వెనక కమలం పార్టీ స్కెచ్ ఎంత వరకూ ఉంది అన్నది తెలియాల్సివుంది. ఎన్నికల ముంది నరేంద్ర మోడీని నానా మాటలు అన్న చంద్రబాబుకు విపక్ష హోదా కూడా లేకుండా చేస్తే ప్లాన్ తెర వెనక జరుగుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరో వైపు టీడీపీ ఘోరమైన ఓటమిపై పార్టీలోని సీనియర్లు కూడా కలవరపడుతున్నారట. 


ఇంతటి దారుణమైన ఫలితాలతో 2024 నాటికైనా కోలుకుంటామా అన్న డౌట్లు వస్తున్నాయట. అదే విధంగా చంద్రబాబు వయసు కూడా మీద పడడం, లోకేష్ తానే ఓటమి పాలు కావడంతో నాయకత్వ లేమితో  టీడీపీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయని అంటున్నారు. మరి చూడాలి ఎమ్మెల్యేలు కనుక పెద్ద ఎత్తున  ఫిరాయిస్తే   టీడీపీకి కోలుకోలేని దెబ్బ పడినట్లే. 


మరింత సమాచారం తెలుసుకోండి: