తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లక్ష్యంగా చేసుకుని పోలవరం ప్రాజెక్టు పై విచారణ జరిపించేందుకు బిజెపి నాయకత్వం రెడీ అవుతుంది. పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం విచారణ చేపడితే , బాబు మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది . లోక్ సభ ఎన్నికల సందర్బంగా కేంద్రం లో బీజేపీ అధికారంలోకి రాకుండా బాబు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారని ఆగ్రహం తో రగిలిపోతున్న కాషాయదళం , పోలవరం పై కేంద్రం విచారణ ను కోరాలని నిర్ణయించింది . 


 ఈ మేరకు రాజ్యసభ లో ఆ  పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే , పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై   త్వరలోనే విచారణ చేపట్టే అవకాశాలున్నట్లు స్పష్టం అవుతోంది .  టీడీపీ ప్రభుత్వ హయాం లో పోలవరం  ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని  ప్రధానమంత్రి మోడీ ని కోరతామని రాజ్యసభ లో జిఎల్ పేర్కొన్నారు .  చంద్రబాబు నాయుడు అంటే ఒకింత ఆగ్రహం తో ఉన్న మోడీ, పార్టీ ఎంపీల  ప్రతిపాదనకు ఎలాగో  ఓకే చెబుతారు కాబట్టి పోలవరంపై  చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకుని విచారణ త్వరలోనే చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది .


 పోలవరం సహాయ , పునరావాస పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు . పునరావాస ప్యాకేజి లో చోటు చేసుకున్న అవినీతి కి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని , అందుకే కేంద్ర ప్రభుత్వ విచారణ కోరుతున్నామని కమలనాథులు చెబుతున్నారు . చూడాలి విచారణ అంటూ చేపడితే ఏమి జరుగుతుందో ... అవినీతి, అక్రమాలు వెలికి వస్తాయో రావో తేలనుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: