అలెక్ రాజు అయ్యే నాటికి అతని వయస్సు చాలా తక్కువ. అలెక్స్ తన సైన్యాలతో ప్రపంచాన్ని అంత గడగడలాడించాడు. ఇరవై రెండవ యేట ఆసియా మైనర్ (టర్కీ) అతడి వశం అయింది. ఇరవై ఐదవ యేట పర్షియా పాదాక్రాంతం అయింది. తర్వాత ఏడేళ్లలో ... ఇప్పటి యుగోస్లేవియా నుంచి ఇండియా వరకు అన్ని ప్రాంతాలు అలెగ్జాండర్ అధీనంలోకి వచ్చాయి.

ప్రపంచాన్ని గడగడ లాడించిన అలెక్స్ విజయ రహస్యం ఏమిటి అన్నది ఇప్పటి వరకు ఎవరికీ అర్ధం కాలేదు. అతను విజయం కోసం ఎలాంటి వ్యూహాలు రచించేవాడు అనే విషయం కూడా ఎవరికీ అంతు పట్టేదికాదు. అలెగ్జాండర్‌ లాంటి వాడు ఒక్కడు తమ రాజ్యంలో ఉంటే చాలు అని చాలామంది రాజులు అనుకునేవారు.

పర్షియా తర్వాత, గ్రీకులకు తెలిసిన భూభాగాలన్నిటినీ జయించాడు అలెగ్జాండర్. చివరిగా భారతదేశం వైపు వచ్చాడు. అయితే అతని సైనిక బలం మొత్తం చిక్కిపోయింది. సైనికులు యుద్ధాలు చేసి చేసి బాగా అలిసిపోయారు. సింధూనదిని దాటి తక్ష శిల నగరంలోకి చొరబడ్డాడు. క్రీ.పూ 326 వ సంవత్సరంలో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలైంది.

కాని అప్పటికే అలక్స్ అలసిపోవడంతో అతను అనుకున్నది జరగలేదు. అలెక్స్ కల నెరవేరలేదు. అతను సింధు నదీ పరివాహక ప్రాంతాలన్నింటినీ దాటి అక్కడ న్ని రాజ్యాలని ఆక్రమించుకున్నాడు. అక్కడే ఉన్న తక్షశిల రాజైన అంభితో యుద్ధ సంధిని కుదుర్చుకున్నాడు. తర్వాత జీలం, చీనాబ్ నదీ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ వంశస్థుడు పురుషోత్తముడితో యుద్ధంలో తలపడ్డాడుఅలెగ్జాండర్.

ఆ యుద్దంలో అతను సెంటిమెంట్ గా భావించే గుర్రం బుస్సీ మరణించింది. మొదటి నుంచి అలెక్స్ ఆ గుర్రంపైనే యుద్దానికి వెళ్ళేవాడు. అంతేకాదు, పురుషోత్తముడితో జరిగిన యుద్దంలో చాలా వరకు సైన్యం దెబ్బతింది. అప్పట్లో చాలా ప్రాంతం నంద రాజ్యం ఆధీనంలో ఉండేది. నదుల సైనిక బలం గురించి విన్న అలెగ్జాండర్ సైన్యం భయంతో వణికి పోయింది.

అల‌గ్జాండ‌ర్, పురుషోత్త‌ముడు మధ్య యుద్ధం జరిగేటప్పుడు రోజులు గ‌డిచే కొద్దీ యుద్ధంలో పురుషోత్త‌ముడిదే పైచేయిలా క‌నిపించ‌సాగింది. అత‌ని చేతిలో అల‌గ్జాండ‌ర్ చ‌నిపోవ‌డం ఖాయ‌మనుకున్నారంతా. ఆ విష‌యం తెలుసుకొన్న అలెగ్జాండ‌ర్ భార్య రొక్సానా, పురుషోత్త‌ముడికి ఒక రాఖీని పంపింది. దాంతోపాటు `యుద్ధంలో క‌నుక నా భ‌ర్త నీ కంటప‌డితే ద‌య‌చేసి అత‌ణ్ని ఏమీ చేయ‌వ‌ద్దు` అన్న సందేశాన్ని కూడా అందించింద‌ట‌.

ఆ త‌రువాత యుద్ధంలో అలెగ్జాండ‌ర్ని హ‌త‌మార్చే అవ‌కాశం వ‌చ్చినా పురుషోత్త‌ముడు త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నాడ‌ట‌. ఇక పురుషోత్తముడితో జరిగిన యుద్ధం తరువాత అలెక్స్ బాగా కున్గిపోయాడు. జబ్బున పడ్డాడు. అందరిని రప్పించుకున్నాడు. అలెక్ మరణించే ముందు ఓ మూడు కోరికలు కోరాడట.

శవపేటికను వైద్యులు మోయనివ్వాలని. తన శవపేటిక వెంబడి మణులు మాణిక్యాలు వెదజల్లాలని కోరాడు. తనను ఖననం చేసిన మట్టిలోంచి తన చేతులను పైకి ఉండనివ్వండి అని కోరాడు. కొల్లగొట్టిన ధనరాశులను పోయేటప్పుడు పట్టుకుపోలేం.... పుట్టినప్పుడు ఒట్టి చేతులే, ప్రాణం పోయినప్పుడు కూడా ఒట్టి చేతులతోనే వెళ్తాం అనే సందేశం ఇచ్చేందుకే అలెక్స్ ఇలా చేయమని కోరాడట. అలెక్స్ కోరిన మూడు కోరికలను అతని పరివారం అలా నెరవేర్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: