ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాన్-ఆధార్ లింక్ గడువుని మరో 3 నెలలు(డిసెంబర్ 31,2019) వరుకు పొడిగించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయినా చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో తాజాగా ఆ గడువును పొడిగించింది.      


ఇప్పుడు ఉన్న సమయంలో ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్‌కార్డు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారింది. ఏ లావాదేవీలకైనా పాన్‌కార్డు నంబర్‌ను తప్పనిసరిగా జత చెయాలి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ ప్రకారం పాన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. అది ఈ నెల ఆఖరకు అందరూ పూర్తి చేసుకోవాలి.             


అలా అనుసంధానం చేసుకొని వారికోసం ప్రభుత్వం గడవు తేదీని పొడిగించింది. మరి ఆధార్ తో పాన్ లింక్ చేసుకొని వారు డిసెంబర్ 31 లోపు లింక్ చేసుకోండి. అయితే ఆధార్ తో పాన్ లింక్ చేసుకునే వారికీ ఇవి తప్పనిసరిగా ఉండాలి. అవేంటో ఇక్కడ చుడండి. 


పేరు, పుట్టిన తేదీ, జెండర్ ఆధార్ కార్డు, పాన్ కార్డులో మిస్ మ్యాచ్ కాకుండా చెక్ చేసుకోండి.


ఏ కార్డులో వివరాలు మ్యాచ్ కాకపోయినా ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోవడం కుదరదు.


ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉంటే UIDAI వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. 


పాన్ కార్డులో సమస్యల కోసం UTI-ITSL ద్వారా చెక్ చేసుకోవచ్చు.


మీ ఆధార్ తో పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు చేసుకోలేరు.


గడువు తేదీ దాటితే పాన్ కార్డు చెల్లదు.


మరింత సమాచారం తెలుసుకోండి: