సినిమాల్లో బాంబు పేలుడ్లు చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా లైవ్ లో పేలడం చూసారా?అదేంటండి పేలుతుంది అని తెలిసి దగ్గరుండి చూడమంటారా ఏంటి ? అంటారా? బాంబు కాకపోయినా ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ పేలడం లైవ్ లో చూసారా?  దీపావళి దగ్గరకొస్తుంది. బాంబులు కాల్చాలని చాల మందికి ఉంటుంది. కానీ వెరైటీ గా ఉంటుందని సిలిండర్ పేల్చాలని అనిపించిందేమో ఏమో గాని ఒక ఇంట్లో ఏకంగా గ్యాస్ సిలిండర్ బాంబు మాదిరిగా పేలింది.  


గ్యాస్ సిలిండర్ బాంబు లా పేలిన ఘటన జనాల్ని భయ కంపితుల్ని చేసింది. ఐతే గ్యాస్ లీక్ అయ్యాక వచ్చిన మంటల్ని దూరంగా ఉండి... సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగానే సిలిండర్ పేలింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సినిమాల్లో యాక్షన్ సీన్ తలపించే రేంజ్ లో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ రోజు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

మేడ్చల్ మండలం రాజ బొల్లారం తండాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ లీక్ అయిన తరువాత మంటలు రావడంతో ఆ ఇంట్లో నుండి అందరు బయటకి వచ్చేసారు.చూస్తూ ఉండగానే పెద్ద శబ్ధంతో బాంబులా సిలిండర్ పేలుడంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు.దీనిని ఒక వ్యక్తి తన మొబైల్ లో చిత్రీకరించాడు. అలాగే  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి గాయాలయ్యాయి.సిలిండర్ పేలిన సమయంలో పెద్ద శబ్దంతో ఇంట్లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి.అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుందా... లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: