మెగా బ్రదర్ నాగబాబు... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎన్నో సినిమాల్లో నటించిన నాగబాబు... ఆ తర్వాత జబర్దస్త్ జడ్జిగారి తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయిపోయారు. జబర్దస్త్ షో తో మెగా బ్రదర్ నాగబాబు నవ్వుల రారాజు గా మారిపోయారు. తన నవ్వుతోనే జబర్దస్త్ కామెడీ షో చూస్తున్న ప్రేక్షకులను నవ్వించగలడు  నాగబాబు. అయితే జబర్దస్త్ షో కి ఎంత పాపులారిటీ ఉందో జబర్దస్త్ షోలో  మెగా బ్రదర్ నాగబాబు నవ్వుకి కూడా అంతే పాపులారిటీ ఉంది. అందుకే జబర్దస్త్ షోలో  నాగబాబు లేకపోతే ఏదో వెలితి కనిపిస్తుంది. అయితే జబర్దస్త్ షో పాపులర్ అవ్వడానికి నాగబాబు నవ్వు కూడా ఒక కారణం అని చెప్పాలి . అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో నరసాపురం ఎంపీ గా పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబు విజయం సాధించలేకపోయారు. దీంతో యధావిధిగా  మళ్ళీ జబర్దస్త్ జడ్జిగా రీ ఏంట్రీ ఇచ్చారు . 

 

 

 

 అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పబోతున్నట్లు తాజాగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జబర్దస్త్ షోలో జడ్జ్  గా ఉన్న  నాగబాబు షో కి గుడ్ బై చెప్పబోతున్నారట. ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రోగ్రాంలు ముందుగానే షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నాగబాబు జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పడం పై వివిధ కారణాలు ఉన్నాయంటూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ షో ని డైరెక్ట్ చేస్తున్న నితిన్ భరత్ లను  తప్పించడం తో మెగా బ్రదర్ నాగబాబు కాస్త హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ షో డైరెక్టర్స్  అయిన నితిన్ భరత్ లతో నాగబాబు కీ  మంచి అనుబంధం ఉందీ . సడన్గా జబర్దస్త్ యాజమాన్యం వారిద్దరిని తప్పించడంతో నాగబాబుకు ఈ విషయంలో కాస్త ఫీల్ అయినట్లు  సమాచారం. 

 

 

 ఈ క్రమంలోనే జబర్దస్త్ జడ్జిగా నాగబాబు గుడ్ బై  చెప్పబోతున్నారు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ నుండి నాగబాబు తప్పుకుంటే  జబర్దస్త్ కి ఉన్న చరిష్మా తగ్గిపోతుందని యాజమాన్యం భావిస్తుందట. దీంతో జబర్దస్త్ మేనేజ్మెంట్ నాగబాబు ను బుజ్జగించే పనిలో పడ్డారుట. అయితే జబర్దస్త్ మేనేజ్మెంట్ బుజ్జగింపులకు నాగబాబు కన్విన్స్  అయి మళ్ళీ జడ్జిగా వస్తారా లేకపోతే జబర్దస్త్ కు  గుడ్ బై చెప్పేస్తారా అన్నది  తెలియాల్సివుంది. జబర్దస్త్ షో నుండి  ఒకవేళ నాగబాబు తప్పుకుంటే... నాగబాబు రేంజ్ ఉన్న మరో జడ్జ్ ని  రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: