మనకు పూర్తిగా బద్ద శత్రువైన పాకిస్థాన్, ఉన్నదానికి లేనిదానికి మన దేశం పై నిందలేయడం, అలానే మన దేశ భద్రతకు సంబందించిన విషయాలను దొంగతనంగా పసిగట్టడం వంటి చర్యలకు గతంలో పలు మార్లు పాల్పడి మన దేశ అధికారుల చేతిలో చావుదెబ్బ తిన్నది. ఇకపోతే నేడు ఏకంగా ఏడుగురు నేవి జవాన్లు, భరత్ కు సంబందించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ కు లీక్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు వార్తలు అందడంతో, అధికారులు రెండు రోజుల క్రితం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మన ఇంటెలిజెన్స్ అధికారులు, 

 

కేంద్ర విభాగం వారి సహకారంతో ఎంతో రీసెర్చ్ చేసి ఆ ఏడుగురు నేవి జవాన్లను వలపన్ని పట్టుకున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల నుండి ఆ ఏడుగురి కదలికలపై అనుమానంతో వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన ఆంధ్ర ఇంటెలిజెన్స్ అధికారులు, చివరికి అవి నిజం అని తేలడంతోనే వారిని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ ఏడుగురిని రిమండ్ లో ఉంచారని, మరొక రెండు రోజుల్లో వారిని కోర్ట్ లో హాజరు పరుచనున్నట్లు సమాచారం. కాగా ఆ ఏడుగురు నేవి జవాన్లు విశాఖపట్నం హార్బర్ లో కొన్నాళ్ల నుండి పని చేస్తూ ఈ విధంగా తప్పుడు చర్యలకు పాల్పడ్డారని, అయితే వారి పేర్లు మాత్రం భద్రత చర్యల దృష్ట్యా బయటకు వెల్లడి చేయలేమని నేవి అధికారులు అంటున్నారు. 

 

అయితే వారు ఏడుగురూ కూడా పాక్ లోని హవాలా ముఠా అధీనంలో కొద్దిరోజలుగా పనిచేస్తున్నట్లు కొంతవరకు తమ విచారణలో తెలిసిందని, అసలు మన జవాన్లకు పాక్ వారితో సమాచారం ఎలా కొనసాగుతోంది, ఇప్పటివరకు ఎటువంటి సమాచారాన్ని అందించారు, మొత్తం ఈ ఘటనలో ఉంది ఆ ఏడుగురేనా, లేక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వారిని కోర్ట్ లో హాజరు పరిచిన తరువాత గాని పూర్తి నిజానిజాలు బయటకు రావని, కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఇంటెలిజెన్స్ విభాగం వారు మరిన్ని గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: