మరికాసేపట్లోనే ఇండియాలో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.  ఈ కొత్త సంవత్సరం వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది యువత.  ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది.  2020 సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు ధూమ్ ధామ్ గా రెడీ అవుతున్నది.  ఇకపోతే, ఇప్పటికే అనేక దేశాల్లో కొత్త సంవత్సరం ఎంటరైంది.  న్యూజీల్యాండ్ లో ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించారు.  

 


ఒక్కో దేశంలో కొత్త సంవత్సరాన్నీ ఒక్కో రకంగా చేస్తుంటారు.  అందులో అల్బేనియాలో న్యూఇయర్ వేడుకలు చాలా కొత్తగా ఉంటాయి.  ఈ వేడుకల కోసమే సంవత్సరం మొత్తం కష్టపడతారేమో అనిపిస్తుంది.  కొత్త సంవత్సరం వేడుకలను అంగరంగ వైభవంగా తమ శక్తి మేరకు నిర్వహించేందుకు రెడీ అవుతుంటారు.  స్నేహితులు బంధువులు అందరూ ఒకే చోట చేరి ఈ వేడుక చేసుకుంటారు.  
ఈ వేడుక కోసం శక్తి మేరకు ఖరీదైన ఆహారాన్ని తయారు చేసుకుంటారు. శక్తికి మించిన సరే మంచి భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటారు.  అంతేకాదు, విందు అంటే ఏదో తినేసి వెళ్లిపోవడం కాదు.  సుదీర్ఘమైన విందును ఏర్పాటు చేసుకుంటారు.  ఈ సుదీర్ఘమైన విందులో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి.  అన్ని రకాల పదార్ధాలు ఇందులో ఉంటాయి.  వీలైనంత ఎక్కువ సమయం భోజనం చేయడనికి కేటాయిస్తారు.  సాధారణంగా రోజు కంటే ఎక్కువ ఆహరం తీసుకుంటారట ఆరోజు.  


ఇది వారి సంపదను, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు.  అంతేకాదు... సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి అందరు కలుస్తారు కాబట్టి ఈ వేడుకను పండగలా చేసుకుంటారట.  అల్బేనియా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.  అక్కడ అన్నిరకాల మతపరమైన వేడుకలను నిషేదించారు.  ఆ దేశంలో సంవత్సరం మొత్తం మీద అందరూ అద్భుతంగా జరుపుకునే పండగ కొత్త సంవత్సరం వేడుకలు ఒక్కటే.  అందుకే శక్తికి మించిన ఆ వేడుకను అద్భుతంగా నిర్వహించుకుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: