ఆమెకు పెళ్ల‌యింది. ఆయ‌న‌కూ వివాహం అయింది. అయితే...ఆమె భ‌ర్త‌ను వ‌దిలేసింది. ఈయన‌ భార్య‌ను విడిచిపెట్టాడు.  అయితే, ఈ ఇద్ద‌రూ త‌మ భాగ‌స్వామ్యుల‌ను వ‌దిలిపెట్టిన త‌ర్వాత‌...ఈ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. ఆ ఇద్ద‌రే..ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల..తమిళ నటుడు విష్ణు విశాల్‌.కొన్నాళ్లుగా విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం తాజాగా వాళ్లిద్ద‌రి ఫోటోల‌తో బ‌హిరంగం అయింది.

 

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న గుత్తా జ్వాల కొద్దికాలానికి పలు విభేదాల కారణంగా విడిపోయింది. అయితే, చేత‌న్ ఆనంద్‌- గుత్తా జ్వాలా విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ కూడా ఓ కారణమంటూ పెద్ద ఎత్తున్నే రూమర్స్‌ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా గతంలోనే కొట్టి పారేశారు. ఇక త‌మిళ‌ హీరో విష్ణు విశాల్‌ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయారు. కాగా... ఈ ఇద్ద‌రూ  ప్రేమించుకుంటున్న వార్త కొద్దికాలం క్రితం హ‌ల్ చ‌ల్ చేసింది. అయితే, ప్రస్తుతం వారిద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

తాజాగా న్యూ ఇయర్ 2020 వేడుకల్లో గుత్తా జ్వాల - విష్ణు విశాల్‌ జంట కలిసి ఎంజాయ్ చేసింది. ఆ సంద‌ర్భంగా ప‌లు ఫోటోలు తీసుకున్నారు. విష్ణు తనను ముద్దాడుతున్న ఫోటోను జ్వాల స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోతో గుత్తా జ్వాల - విష్ణు విశాల్‌ మధ్య ఎఫైర్‌ బహిరంగమైపోయిందంటున్నారు. స‌హ‌జంగానే ఈ ఫోటోల‌పై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్‌ విమర్శించాడు.  వేరువేరుగా విడిపోయి ఒకటి అవుతున్న గుత్తా జ్వాల - విష్ణు విశాల్‌ జంట అంటూ మరో నెటిజన్‌ సరదాగా పేర్కొన్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: