వలస కూలీలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన, కరోనా నేపథ్యంలో వారి ఆకలి తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు.

 

సంక్షోభ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు, వలస కూలీలకు ఇచ్చిన భరోసా అభినందనీయం’’ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ బాల్యన్ ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అద్భుతం. ఇదీ నాయకత్వం అంటే’’ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా అడ్వయిజర్ సంజయ్ బారు ట్వీట్ చేశారు. 


వలస కూలీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు ఇదే అని, ఇంత స్పష్టమైన విశ్వాసం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అని ఎ.ఎన్.ఐ. మేనేజింగ్ ఎడిటర్ స్మితా ప్రకాష్ ట్వీట్ చేశారు. అమె ట్వీట్‌కు పలువురు జాతీయ మీడియా ప్రతినిధులు రిప్లయ్ ఇచ్చారు. వలస కూలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలించిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీల ను వెనక్కి పంపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి అండగా నిలుస్తున్న తీరు అద్భుతం అని న్యూస్ 18 మేనేజింగ్ ఎడిటర్ అమీష్ దేవగన్  ట్వీట్ చేశారు.  ‘భారతదేశం రాష్ట్రాల సరిహద్దులతో విభజింపబడిలేదని కేసీఆర్ నిరూపించారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వసుదైక కుటుంబం అనే విధానం పాటించాలి’ భారత్ సమాచార్ ఎడిటర్ ఇన్ చీఫ్ బ్రజేష్ మిశ్రా ట్వీట్ చేశారు. 

‘‘ముఖ్యమంత్రి పాటించాల్సిన ధర్మాలు ఏమిటో తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి వినండి. మీరు (కేసీఆర్) హృదయాలను గెలుచుకున్నారు. వేరే రాష్ట్రాల్లో వలస కార్మికులను ఎలా వెనక్కి పంపారో మేము చూశాం. కేసీఆర్ అలా చేసి ఉండకపోతే, అక్కడ కూడా అదే పరిస్థితి ఉండేది’’ న్యూస్ 18 సీనియర్ జర్నలిస్టు రవి ప్రతాప్ దూబే ట్వీట్ చేశారు. కేసీఆర్ నుంచి ఇతర ముఖ్యమంత్రులు నేర్చుకోవాలి అని సీనియర్ కాలమిస్టు, మైసూరు ఎంపి ప్రతాప్ సింహ ట్వీట్ చేశారు. కేసీఆర్ నిజమైన నాయకుడు అని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి నాయకుడు అవసరం అని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేర్కొన్నారు. 

 

ఇంతకంటే విశ్వాసం కలిగించే విషయం మరొకటి ఉంటుందా అని సిఎన్ఎన్ సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా ట్వీట్ చేశారు. వలస కూలీలు బాధ పడొద్దని చెప్పారు, ఎంత ఖర్చయినా సరే భరిస్తాం అన్నారు, వారిని తమ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండండి అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు అంటూ మెహతా ట్వీట్ చేశారు. ‘‘మీరు హృదయాలు గెలుచుకున్నారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు  కూడా తెలంగాణ ముఖ్యమంత్రి లాగా వలస కార్మికుల హృదయాలను గెలుచుకోవడం నేర్చుకోవాలి’’ అని ఎబిపి న్యూస్ సీనియర్ జర్నలిస్టు పింకీ రాజ్ పురోహిత్ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ ప్రజలు సరైన నాయకుడ్ని ఎన్నుకున్నారు’’ అని మిస్ సౌత్ ఇండియా శివాని ట్వీట్ చేశారు. ‘‘కరోనా నేపథ్యంలో వలస కార్మికుల విషయంలో, రైతుల విషయంలో కేసీఆర్ ఇచ్చిన భరోసా మిగతా దేశమంతా వ్యాపించాలి’’ అని ప్రముఖ సినీ నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: