ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం రాజకీయంగా హీటు పుట్టించే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అధికార పార్టీ దూకుడు ఎక్కువగా ఉండడంతో పాటు, పెద్దఎత్తున నాయకులు, అధికార పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతుండడం, టిడిపి కీలక నాయకులే టార్గెట్ గా వరుసగా, ఒక్కొక్కరి పైన కేసులు నమోదు అవుతున్నాయి. కీలక నాయకులంతా, అరెస్ట్ అవుతుండడం, జైలుపాలు అవుతుండడం మొదలైన అన్ని విషయాలపై చాలా కాలంగా ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. ముందు ముందు మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉండటంతో పాటు, టిడిపిని ఖాళీ చేయాలని ఉద్దేశం లో జగన్ ఉన్నట్టుగా ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. 

 

IHG


దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు రాష్ట్రపతిని కలిసి ఏపీ లో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో సమావేశం అవ్వాలని, ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా కోరినట్టు సమాచారం. నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలిసి, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తలెత్తిన పరిణామాలన్నింటినీ రాష్ట్రపతికి వివరించి, ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరబోతున్నారట. 

 

IHG


ఈ సందర్భంగా ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావప్రకటన స్వేచ్ఛ ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని ధిక్కరించేలా వ్యవహరించడం తదితర విషయాలపై ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం. పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ, వరుస వరుసగా కేసులు నమోదు చేయించడం, సోషల్ మీడియా కార్యకర్తల పైన అక్రమంగా వేధింపులకు పాల్పడడం వంటి అన్ని విషయాలపై టిడిపి ఎంపీల బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇదే విషయాలపై కేంద్ర మంత్రులను కలిసి వైసీపీ దూకుడుకి బ్రేకులు వేసేలా చూడాలని కోరే విధంగా టీడీపీ ప్లాన్ చేసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: