ESI కుంభకోణం విషయంలో మాజీ మంత్రి పితాని హస్తం ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు న్యూస్ రావడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన కొడుకు పితాని సురేష్ మరియు ఆయన పీఏ మురళి  మందుల కొనుగోలు వ్యవహారంలో వెనక ఉండి చక్రం తిప్పినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించుకుని వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో పితాని కొడుకు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ని ఆశ్రయించగా… కోర్టు బెయిల్ ఇవ్వటానికి అంగీకరించలేదు. 
 
ఇదిలా ఉండగా తండ్రి పితాని సత్యనారాయణ ని అడ్డంపెట్టుకుని సురేష్ ఈ కుంభకోణంలో భారీగా అవినీతికి తెగపడ్డారని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ESI కుంభకోణం కి సంబంధించి ESI ప్రభుత్వ ఆసుపత్రులలో కొనుగోలుకు సంబంధించి అప్పట్లో మంత్రులుగా పని చేసినటువంటి పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు ఒత్తిడి వల్ల కొన్ని లేనిపోనీ నకిలీ కంపెనీలకు టెండర్లు ఇప్పించారనే ఆరోపణలతో ఎదుర్కొంటున్న ఈ కేసులో కీలకమైన ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 
 
పితాని సత్యనారాయణ తో పాటు ఆయన కొడుకు సురేష్ ఒత్తిడి వల్లే ఈ కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే తాజాగా ESI కుంభకోణంలో పితాని సత్యనారాయణ పాత్ర స్పష్టంగా ఉన్నట్లు టాక్. ఇప్పటికే ఈ కుంభకోణం కేసులో 14 మందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కార్మిక శాఖ గా ఉన్న అచ్చెన్నాయుడు ఈ కుంభకోణం కేసులో A1 గా ఉన్నారు. దీంతో అరెస్టయిన అచ్చెనాయుడుకి ఇంకా బెయిల్ దొరకకపోవటం తో.. ఈ స్కాంలో ఇంకా పేర్లు బయట పడుతున్న తరుణంలో టీడీపీ వర్గాలలో టెన్షన్ నెలకొన్నట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: