ప్రస్తుతం చాల మంది పాన్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే మీ పాన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా.. అయితే మీరు వాటిని సరిచేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకోసమే ఒక్క యాప్ అందుబాటులోకి వచ్చింది. పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఆధార్, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోకపోతే రానున్న రోజుల్లో ఇబ్బంది పడాల్సి రావొచ్చు. పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి వచ్చే ఏడాది మార్చి నెల చివరి వరకు గడువు ఉందని నిపుణులు వెల్లడించారు.


అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఆధార్, పాన్ కార్డు అనుసంధాన గడువును పొడిగిస్తున్నవిషయం అందరికి తెలిసిందే. అందువల్ల మీకు ఇప్పటికైనా ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు. అనుసంధానం లేనిచో తిప్పలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ రెండింటిని సులభంగా లింక్ చేసుకోవచ్చునని నిపుణులు తెలిపారు.


అంతేకాక ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించుకోవాలని అన్నారు. పాన్ కార్డు లేదా ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే రెండింటినీ లింక్ చేసుకోవడం కుదరదు అని తెలిపారు. అప్పుడు మీరు పాన్ కార్డ్ లేదా ఆధార్‌లో వివరాలను సరిచేసుకోవాలని అన్నారు. పాన్ కార్డులో తప్పులు సరిచేసుకోవాలంటే ఉమాంగ్ యాప్ ద్వారా ఈ పని పూర్తి చేయొచ్చునని తెలియజేశారు.


అయితే ఉమాంగ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లో‌డ్ చేసుకోవచ్చునన్నారు. ఇక డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలన్నారు. ఇలా లాగిన్ అయిన తర్వాత సెర్చ్ బార్‌లో పాన్ కార్డు అని టైప్ చేసి సెర్చ్ చేయాలని తెలిపారు. ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయని వీటిల్లో పాన్ కార్డు కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలని తెలిపారు. తర్వాత మీ వివరాలను మార్చుకోవాలని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: