రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. ఎంత విధేయత చూపినా కూడా కొన్ని సార్లు అధినాయకత్వం నుంచి మొండి చేయి రావచ్చు. అపుడు ఆవేశ కావేశాలు కూడా ప్రబలవచ్చు. అలాంటి ఉదంతాలు ప్రతీ వారి జీవితాల్లో ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీర విధేయుడు అయిన నేత. ఆయన యువ నాయకత్వాన్ని మెచ్చి ఇందిరా గాంధీ కేవలం 33 ఏళ్ళ వయసులోనే పీసీసీ ప్రెసిడెంట్ చేసింది. ఆయన తన కంటే రెట్టింపు వయసు. పవర్ ఫుల్ సినీ గ్లామర్ ఉన్న ఎన్టీయార్ కి ఎదురునిలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అసెంబ్లీలో విపక్ష నేతగా అయనా దాదాపు ఏడేళ్ల పాటు  నాటి   ముఖ్యమంత్రి ఎన్టీయార్ తో రాజీలేని  రాజకీయ పోరాటం జరిపారు. ఫలితంగా 1989లో కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అపుడు చెన్నారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కచ్చితంగా వైఎస్సార్ కే అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ నేదురుమల్లి జనార్ధనరెడ్డికి చాన్స్ వచ్చింది. ఆ తరువాత కేంద్రం నుంచి తీసుకువచ్చి మరీ విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు.

ఇలా సీఎంగా ప్రతీ సారీ అవకాశం త్రుటిలో తప్పిపోవడంతో వైఎస్సార్ చాలా బాధపడ్డారు. అభిమానులు అయితే అణచుకోలేకపోయారుట. ఆ టైంలో కాంగ్రెస్ ని వీడి సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని వైఎస్సార్ మీద వత్తిడి వచ్చినట్లుగా నాడు ప్రచారం  అయితే  జరిగింది. ఆ పార్టీ పేరు కూడా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ అని కొందరు అభిమానులు డిసైడ్ చేశారుట. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విధేయ‌త, విశ్వాసం కలిగిన నేతగా, సుశిక్షితుడైన కార్యకర్తగా వైఎస్సార్ హై కమాండ్ ని నమ్మి పనిచేశారు తప్ప కాంగ్రెస్  గీత దాటలేదు అంటారు.

ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష  బాధ్యతలు స్వీకరించడంతో వైఎస్సార్ కి దశ తిరిగింది. ఆమె మన్ననలు పొంది ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా ఆ తరువాత రెండు మార్లు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమ్మడి ఏపీలో  ప్రజా నేతగా తిరుగులేని పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి వైఎస్సార్ ప్రాంతీయ పార్టీ పెట్టకపోయినా ఆయన కుమారుడు జగన్ మాత్రం తండ్రి పేరిట పార్టీ పెట్టి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి రావడం గొప్ప విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి: