ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచ దేశాల ను అతలాకుతలం చేస్తూ వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న  విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కరోనా వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. అయితే కరోనా  వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పటికే పలు దేశాలలో క్లినికల్ ట్రయల్స్ చివరిదశ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే గాని పరిస్థితి సద్దుమణిగేలా కనిపించని నేపథ్యం లో శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే వివిధ దేశాలలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా... ఇక ఇప్పుడు ఈ రేసులోకి మరో కొత్త వ్యాక్సిన్ వచ్చి చేరింది.



 అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ  తయారీ సంస్థ మెర్క్  అండ్ కార్పొరేషన్ కరోనా  వైరస్ కోసం  తయారుచేసిన వ్యాక్సిన్  క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు సిద్దం అవుతుంది. వి591 పేరిట తయారుచేసిన వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం వాలంటీర్లను  రిక్రూట్ చేసుకుంటుంది ఆ సంస్థ. కాగా ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్ తయారీ సంస్థలు తుదిదశ క్లినికల్  ట్రయల్స్ లో ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు మెడెర్నా,  ఫైజర్,  ఆస్ట్రాజనికా  లాంటి సంస్థలు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్  చివరి దశలో ఉన్నాయి.



 అయితే మెర్క్ సంస్థ మరో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కరోనా  వైరస్ కోసం కాదు ఎయిడ్స్  కోసం. ఇది వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ రేసులోకి మరో సంస్థ రావడం అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి.  మరి క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేది రానున్న రోజుల్లో తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: