రైతుల బంద్ కు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాయి. నేషనల్ హై వేలను టిఆర్ఎస్ ,కాంగ్రెస్ నిర్భంధించే ఆలోచనలో ఉన్నాయి. షాద్ నగర్ వద్ద బెంగుళూర్ హై పై ధర్నాలో కేటీఆర్ కూర్చుంటారు.  షాద్ నగర్ మార్కెట్ కమిటీ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా చేస్తారు. శామీర్ పేట వద్ద రాజీవ్ రహదారి పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన తెలుపుతారు. సంగారెడ్డి లో ముంబై హైవే పై జగ్గారెడ్డి ధర్నా చేస్తారు. నాగ్ పూర్ హై వే పై కామారెడ్డి వద్ద కల్వకుంట్ల కవిత ధర్నా చేస్తారు.  మంత్రి తలసాని ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో బైక్ ర్యాలీ చేస్తున్నారు.

దేశ వ్యాప్త రైతాంగ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. ఇక మంత్రి శ్రీనివాస గౌడ్ మీడియాతో మాట్లాడారు. రైతన్నలకు బాసటగా నిలవాలి.. ప్రజలు సహకరించాలి.. మధ్యాహ్నం దాకా అన్ని వర్గాల వ్యాపారాలు.. రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ పాటించాలి అని సూచించారు. గద్వాల అలంపూర్ టోల్ గేట్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి, బూర్గుల వద్ద మంత్రి కేటీఆర్.. అన్ని రహదారుల్లో ఆయా ఎమ్మెల్యేలు బంద్ లో పాల్గొంటారు అని ఆయన పేర్కొన్నారు. కొత్త చట్టాల ద్వారా నిలువ చేసి కృత్రిమ కొరత తెచ్చే కుట్ర కేంద్రం చేస్తుంది అని ఆరోపించారు.

రైతుల శ్రమ వల్లే 130 కోట్ల జనాభా అన్నం తినే పరిస్థితి ఉందని అన్నారు. కొత్త చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాలపైన రుద్దుతుంది అని విమర్శించారు. కరెంట్ ప్రయివేటు చేసి ఉచిత కరెంట్ ఇవ్వకుండా కుట్ర చేస్తుంది అని మండిపడ్డారు. రైతుల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది అన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆవేదనతో ఉంటే.. పరిస్థితి ఎట్లా ఉంటుంది అని నిలదీశారు. సన్న బియ్యం కొనొద్దని కేంద్రం వద్దంటుంది.. ఆంక్షలు విదిస్తుంది.. ఎల్ ఐ సీ.. బీఎస్ఎన్ఎల్ రైల్వే.. అన్నీ ప్రయివేట్ పరం చేస్తున్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: