కేంద్ర ప్రభుత్వం రైతుల కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన భారత్ బంద్ కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారింది. రైతులు పిలుపునిచ్చిన దేశ వ్యాప్త భారత్  బంద్‌ కొనసాగుతోంది. ప్రతి పక్ష పార్టీల కార్యకర్తలు, తెలంగాణాలో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తెల్లవారు జాము నుంచే రోడ్ల మీదకు వచ్చి దర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రైల్ రోకోలు కూడా నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసేశారు. 

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ ఉంటుందని రైతు సంఘాలు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా బంద్ కు మద్దతు తెలపడంతో తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఎక్కడిక్కడ స్తంభించాయి. రాస్తా రోకోల కారణంగా చాలా చోట్ల  ట్రాఫిక్‌ జామ్ అయింది. ఇకభారత్ బంద్ లో భాగంగా మియపూర్ ఆల్విన్ చౌరస్తాలో పోలీసులే భారికేడ్లు పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారే బారికేడ్లు తొలగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 

తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బందంగా పోలీసులు వ్యవహరించలేదని ఇప్పుడు పోలీసులే స్వయంగా ట్రాజిక్ కు అంతరాయం కలిగిస్తూ నడి రోడ్డు పై బారికేడ్లు పెట్టడం పట్ల వాహన దారులు మండిపడ్డారు. పోలీసులతో గొడవ పడి బారికేడ్లు తొలగించి వెళ్లిపోయారు.  అయితే హైదరాబాద్ ఉషా ముళ్ళపూడి వద్ద శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఆయనకు ఎదురు తిరిగి మాట్లాడడంతో ఎమ్మెల్యే ఆ వ్యక్తి మీద చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే చేయి చేసుకోవడంతో ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు అతనిని కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని అతనిని వెనక్కు తీసుకు వెళ్లారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: