రైతులకు మద్దతుగా భారత్ బంద్ లో  భాగంగా సికింద్రాబాద్ ఆల్ఫా కేఫ్ వద్ద మంత్రి తలసాని ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెండు వేల బైక్ లతో మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ యూత్ నాయకుడు తలసాని సాయి కిరణ్ ర్యాలీ నిర్వహించారు. స్వయంగా బైక్ నడిపి కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా మంత్రి తలసాని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నల్ల చట్టాలను కేంద్రం తెస్తోందని అన్నారు. భారతదేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, రైతు నడ్డి విరిచే విధంగా ఎన్డీయే చట్టాలు తెచ్చిందని అన్నారు.  

రాజ్యసభలో నూతన వ్యవసాయ బిల్లును టిఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు వ్యతిరేకించాయని కానీ డోర్లు మూసి, టీవీల లైవ్ లు ఆపి కొత్త వ్యవసాయ చట్టాన్ని పాస్ చేయించుకున్నారని ఆయన అన్నారు. దేశ చరిత్రలోనే రైతులను ఆదుకున్నది కేసీఆర్ ఒక్కరేనని విత్తనాలు, ఎరువులు రైతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కేంద్రానికి లేదన్న ఆయన శివరాజ్ సింగ్ చౌహన్ నిన్నా, మొన్న కొత్త వ్యవసాయ చట్టం పై ఏం మాట్లాడారో అందరూ చూసారని అన్నారు. ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అధికారమే శాస్వతం అని.. మాకు ఎదురు లేదని భావించి బీజేపీ ఇష్టం వచ్చినట్లు చేస్తోందని అన్నారు.

కేంద్రంలో మీ మంత్రులు ఇప్పటికి నాలుగు సార్లు రైతులతో ఎందుకు చర్చలు జరిపారని ఆయన అన్నారు. ఎన్డీయేకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్రం భేషజాలకు వెళ్లకుండా దిగి రావాలని అన్నారు. జిఎస్టీ తీసుకువచ్చినప్పుడు.. గుజరాత్, మహారాష్ట్ర వాళ్ళతో మాట్లాడి జిఎస్టీ తగ్గించారని ఆయన ఆరోపించారు. సన్నాల కోసం తెలంగాణ నియంత్రిత సాగు అమల్లో తెచ్చామని సన్న బియ్యానికి మద్దతు ధర కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్రం అడ్డుకుంటుందని అన్నారు. ఎవర్ని పెంచిపోషించడం కోసం ఈ చట్టాలు తెచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుందని  రైతులతో డ్రామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వ పీఠం కదులుతదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: