ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటించడంతో అమరావతి ప్రాంత రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు,నిరసనలు వ్యక్తమయ్యాయి."మూడు రాజధానులు వద్దు ..ఒకే రాజధాని ముద్దు " అంటూ ఉద్యమాన్ని ఉదృతం చేశారు.నేటితో ఉద్యమాన్ని చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను అమరావతి జేఏసీ నిర్వహించింది.ఈ సభకు హాజరు అయిన టి‌డి‌పి అధినేత చంద్రబాబు నాయుడు సి‌ఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ తీవ్ర స్థాయిలో ద్వాజమెత్తారు. ఈ సందర్బంగా అమరావతి ని రాజధానిగా కొనసాగించాలని ఉద్యమం చేపట్టిన విప్లవ వీరులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.చంద్రబాబు నాయుడు మాటలాడుతూ అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.. సి‌ఎం జగన్మోహన్ రెడ్డి పాలనను రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపాడు.తమ పాలనలో అమరావతి ని రాజధానిగా ప్రకటించినందుకే జగన్ రాజధాని మార్పుకు తెరలేపరాని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కక్ష పూరిత రాజకీయాలు చెయ్యడం జగన్ మనుకోవాలని సూచించారు.దమ్ముంటే రాష్ట్రాన్ని అభివృద్ది చేసి చూపాలని హెచ్చరించారు.అమరావతి రాజధాని నిర్మాణంకై భూములను త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.ప్రజలకు జగన్  గాలి కబుర్లు చెబుతూ మబ్యా పెడుతున్నాడని అన్నాడు.జగన్ ఇప్పటికైనా గాలి కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలి.వైసీపీ ప్రభుత్వం అధికరంలోకి వచ్చి  19 నెలలు అయిన  ఏం పీకరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నా దగ్గర జగన్ పిచ్చి తెలివి తేటలు పనిచేయవని తీవ్ర స్థాయిలో ద్వాజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: